ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : సోమవారం, 6 నవంబరు 2023 (22:57 IST)

కీడా కోలా- బ్రహ్మానందం రోల్‌కు మొండిచెయ్యి.. వీల్‌చైర్‌కే పరిమితం

Bramhanandam
Bramhanandam
హాస్య బ్రహ్మ బ్రహ్మానందం తాజా చిత్రం కీడా కోలా ఆయన అభిమానులను నిరాశపరిచింది. తరుణ్ భాస్కర్ ఆకట్టుకునే పాత్రలను రూపొందించడంలో స్పెషల్ కావడంతో ఆయన పాత్రపై భారీ అంచనాలున్నాయి. 
 
దురదృష్టవశాత్తూ, బ్రహ్మీకి కీడా కోలా రోల్ అంతగా కలిసిరాలేదు. అతని పాత్ర కేవలం కొన్ని డైలాగ్స్, ఎక్స్‌ప్రెషన్స్‌తో వీల్‌చైర్‌కు పరిమితమైంది. 
 
ఈ రోల్ ప్రేక్షకులను నిరాశపరిచింది. కామెడీ ట్రాక్ ఆశించిన స్థాయిలో వర్కవుట్ కాలేదు. బ్రహ్మానందంకు తరుణ్ భాస్కర్ తగిన పాత్ర ఇవ్వలేదు. మంచి అవకాశాన్ని వృధా చేసుకున్నాడు.