శనివారం, 27 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : గురువారం, 28 ఏప్రియల్ 2016 (10:43 IST)

కమల్‌ హాసన్, శ్రుతిహాసన్‌ సినిమాలో బ్రహ్మానందం!

కమలహాసన్‌ కథానాయకుడిగా టి.కె.రాజీవ్‌ కుమార్‌ దర్శకత్వంలో ఒక సినిమా తెరకెక్కబోతోంది. ఈ సినిమాను ఈ నెల 29న చెన్నైలో ప్రారంభించనున్నారు. నడిగర సంగం కార్యాలయంలో ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరుపుకోనున్నట్టు తెలుస్తోంది. కమల్‌ సొంత బ్యానర్‌ పై రూపొందనున్న ఈ సినిమాలో బ్రహ్మానందం నటించనున్నాడు. 
 
ఈ పాత్ర కోసం బ్రహ్మానందాన్ని కమల్‌ సూచించాడని తెలిసింది. ఈ సినిమాలో బ్రహ్మానందం పాత్ర వైవిధ్యభరితంగా ఉంటుందని చెబుతున్నారు. తమిళ, తెలుగు, మలయాళ భాషల్లో ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో కమల్‌ కూతురు పాత్రను శ్రుతిహాసన్‌ పోషించనుండటం విశేషం.

తండ్రీకూతుళ్లు కలిసి మొదటిసారిగా నటిస్తుండటం వలన, ఈ సినిమాపై అంచనాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఈ సినిమాకి ఇళయరాజా సంగీతాన్ని సమకూరుస్తున్నారు.