చెన్నైలో సందడి చేసిన 'బ్రహ్మస్త్ర' బృందం - చెన్నై నా హోంటౌన్ : నాగార్జున
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్, ఆలియాభట్ జంటగా నటించిన "బ్రహ్మాస్త్ర" చిత్రం వచ్చే నెల 9వ తేదీ విడుదల కానుంది. ఈ విడుదల తేదీకి కొన్ని వారాల సమయం మాత్రమే ఉండటంతో ఈ సినిమా ప్రమోషన్స్ జోరుగా సాగుతున్నాయి. తమిళంలో "బ్రహ్మాస్త్ర"ను ప్రమోట్ చేయడానికి తారాగణంలోని రణబీర్, నాగార్జునతో కలిసి చిత్ర సమర్పకుడైన దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి కూడా చెన్నై వచ్చారు. తమిళం, తెలుగు, మలయాళం, కన్నడ భాషల్లో ఈ చిత్రాన్ని ఎస్‌ఎస్ రాజమౌళి సమర్పిస్తున్నారు. వీరంతా కలిసి కొన్న నెలల క్రితమే బ్రహ్మాస్త్ర చిత్ర ప్రమోషన్ వర్క్స్‌ను ప్రారంభించారు.
స్థానిక చెన్నై, రాయపేటలోని పీవీఆర్ సత్యం సినిమాస్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో వారు పాల్గొని మాట్లాడారు. ముందుగా రాజమౌళి మాట్లాడుతూ, 'ఏళ్ల తరబడి కష్టపడి వచ్చిన 'బ్రహ్మాస్త్రం'. మన పురాణాల్లో అస్త్రాల గురించి విన్నాం.. వాటిని ఇప్పుడు ఈ సినిమాలో వేరే కోణంలో చూస్తాం. పోరాటాలు, పరిమిత శక్తులతో అయాన్ హీరోగా రూపొందాం. ఈ అస్త్రాలే బలమైన విలన్. ప్రేమ ప్రతిదానిపై విజయం సాధిస్తుందని ఈ చిత్రం మనకు బోధిస్తుంది' అని తెలిపారు.
తెలుగు హీరో అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, చెన్నైతో తనకున్న అనుబంధాన్ని వివరించారు. 'నేను నా కెరీర్‌ని ప్రారంభించిన చెన్నైకి తిరిగి రావడం ఎల్లప్పుడూ ఆనందంగా ఉంటుంది. ఇది నాకు హౌం టైన్. నా ఐకానిక్ చిత్రాలలో ఒకటైన 'గీతాంజలి'ని దర్శకుడు మణిరత్నం తెరకెక్కించారు. 'బ్రహ్మాస్త్ర'లో నేను 'నందియాస్త్ర' శక్తితో ఒక ఆర్టిస్టుగా నటించాను. చిన్నప్పటి నుంచి దివంగత ఎన్టీఆర్, ఏఎన్నార్ వంటి నటించిన అనేక పురాణ, ఆధ్యాత్మిక, ఇతిహాస చిత్రాలను చూసి పెరిగాను. అందువల్ల నేను ఎల్లవేళలా పౌరాణిక కథలను ఇష్టపడతాను. 'బ్రహ్మస్త్రం' ఒక ల్యాండ్‌మార్క్ అవుతుందని నేను గట్టిగా నమ్ముతున్నాను అని చెప్పారు.
బాలీవుడ్ హీరో రణ్‌బీర్ కపూర్ మాట్లాడుతూ, సంస్కృతీ సంప్రదాయాలకు నిలయమైన చెన్నైలో ఉండటం ఆనందంగా ఉందన్నారు. చిత్ర దర్శకుడు అయాన్ ముఖర్జీపై ప్రశంసల వర్షం కురిపించారు. "అతను నాకు చిన్నప్పటి నుండి తెలుసు. అతను ఈ ప్రాజెక్ట్ కోసం ఒక దశాబ్దం పాటు తన సమయాన్ని వెచ్చించారు. అమితాబ్ బచ్చన్, నాగార్జునతో కలిసి పనిచేయడం గౌరవంగా ఉందని అని అన్నారు.
అలాగే, తన భార్య అలియా భట్ గురించి రణబీర్ మాట్లాడుతూ.. "మా ప్రేమకథ ఈ సినిమాతో మొదలైంది. ఇప్పుడు మేం పెళ్లి చేసుకున్నాం, మా బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాం. మీతోపాటు నేను కూడా బ్రహ్మాస్త్రం కోసం ఎదురు చూస్తున్నాను అని చెప్పారు.