శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 1 ఏప్రియల్ 2021 (22:36 IST)

లైకాకు షాక్ : డైరెక్టర్ శంకర్‌కు అనుకూలంగా హైకోర్టు తీర్పు

ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్‌కు మద్రాస్ హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. డైరెక్టర్ శంకర్‌కు అనుకూలంగా తీర్పునిచ్చింది. ఇండియన్ -2 సినిమా షూటింగు పూర్తి చేయకుండా శంకర్ మరో ప్రాజెక్టుకు దర్శకత్వం చేయకుండా స్టే విధించాలని కోరుతూ లైకా ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ హైకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను తోసిపుచ్చింది. శంకర్‌ను అలా నిర్బంధించలేమని పేర్కొంది. 
 
విశ్వనటుడు కమల్ హాసన్ హీరోగా ఇండియన్-2 చిత్రాన్ని లైకా ప్రొడక్షన్ నిర్మాణ సంస్థ చేపట్టింది. ఈ ప్రాజెక్టు కోసం ఇప్పటికే 180 కోట్ల రూపాయలను ఖర్చు చేసింది. దర్శకుడు శంకర్‌‌కు పారితోషికంగా మొత్తం రూ.40 కోట్లు ఇచ్చేలా ఒప్పందం కుదుర్చుకోగా అందులే రూ.14 కోట్లను చెల్లించినట్టు పేర్కొంది. మిగిలిన 26 కోట్ల రూపాయలను చెల్లించేందుకు సిద్ధమని, తమ ప్రాజెక్టును పూర్తి చేసిన తర్వాత ఇతర ప్రాజెక్టులకు కమిట్ అయ్యేలా ఆదేశించాలని కోరింది. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు.. దర్శకుడు శంకర్‌ను అలా నిర్బంధించలేమని పేర్కొంది. 
 
ఇదిలావుంటే, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, సెన్సేష‌న‌ల్ డైరెక్ట‌ర్ శంక‌ర్ కాంబినేష‌న్‌లో ఓ ప్రాజెక్టు తెరకెక్కనుంది. రామ్ చ‌ర‌ణ్ నుంచి మ‌రో పాన్ ఇండియ‌న్ మూవీ రాబోతోంది. దీన్ని దిల్ రాజు నిర్మించనున్నారు.