సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 4 ఆగస్టు 2023 (14:25 IST)

చరణ్‌కు ఏ కష్టం రాకూడదని దేవుడిని ప్రార్థిస్తాంటాను : 'బ్రో' దర్శకుడు సముద్రఖని

Director Samudrakhani
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్‌ను తాను ఒక కుమారుడిలా భావిస్తానని బ్రో చిత్ర దర్శకుడు సముద్రఖని అన్నారు. చెర్రీకి ఎలాంటి కష్టం రాకూడదని దేవుడిని ప్రార్థించేవారిలో తాను కూడా ఒకడినని ఆయన చెప్పారు. 'బ్రో0' చిత్రం ఘన విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆయన ఓ ఇంటర్వ్యూ ఇచ్చారు. ఇందులో తన మనసులోని విషయాలను వెల్లడించారు.
 
'రామ్ చరణ్‌తో కలిసి 'ఆర్‌ఆర్‌ఆర్‌'లో నటించాను. నన్ను బాబాయ్‌ అని పిలిచేవాడు. మేమిద్దరం ఆ సినిమా సమయంలో స్నేహితులమయ్యాం. అతడిని నా సొంత కుమారుడిలా భావిస్తాను. క్లీంకార పుట్టినప్పుడు మెసేజ్‌ పెట్టా. శంకర్‌ దర్శకత్వంలో వస్తున్న 'గేమ్‌ ఛేంజర్‌'లోనూ నా పాత్ర రామ్ చరణ్‌ పాత్రకు చాలా సన్నిహితంగా ఉంటుంది. చరణ్‌కు ఏ కష్టం రాకూడదని దేవుడిని ప్రార్థించే వారిలో నేనూ ఉంటాను' అని అన్నారు. 
 
ఇక అల్లు అర్జున్‌ గురించి మాట్లాడుతూ.. 'అల వైకుంఠపురం'లో బన్నీతో కలిసి నటించాను. నేను తనని అన్బు అర్జున్‌ అని పిలుస్తాను. అన్బు అంటే ప్రేమ అని అర్థం. ఆయన అందరితో ప్రేమగా ఉంటాడు. షూటింగ్‌ సమయంలో నన్ను చాలా జాగ్రత్తగా చూసుకున్నాడు. ఒక్కమాటలో చెప్పాలంటే అల్లు అర్జున్‌ బంగారం లాంటి మనసున్న వ్యక్తి' అని చెప్పారు.