శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : బుధవారం, 24 జనవరి 2024 (17:03 IST)

బుచ్చిబాబు దర్శకత్వంలో రామ్ చరణ్

ram charan
ప్రముఖ దర్శకుడు కె.సుకుమార్ శిష్యుడు, "ఉప్పెన" ఫేం బుచ్చిబాబుకు లక్కీ ఛాన్స్ లభించింది. హీరో రామ్ చరణ్‌ను డైరెక్ట్ చేయనున్నారు. నిజానికి ఆయన తొలుత జూనియర్ ఎన్టీఆర్‌తో ఒక చిత్రాన్ని తెరకెక్కించాలని భావించారు. ఆ దిశగా చర్చలు కూడా సాగాయి. కానీ, చివరి నిమిషంలో ఆ ప్రాజెక్టు ఫైనలైజ్ కాదు. అదేసమయంలో చెర్రీని డైరెక్ట్ చేసే అవకాశాన్ని దక్కించుకున్నారు. 
 
ఈ సినిమా పూజా కార్యక్రమాన్ని కూడా జరుపుకుంది. సుకుమార్ తన సినిమాలకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌కి ఎక్కువ సమయం తీసుకుంటాడు. అలాగే బుచ్చిబాబు కూడా తన సినిమాకి సంబంధించిన స్క్రిప్ట్ వర్క్ చేస్తూ వచ్చాడు. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. ప్రస్తుతం చరణ్ తన 15వ సినిమాను శంకర్ దర్శకత్వంలో చేస్తున్నాడు. 
 
ఆ తర్వాత ఆయన బుచ్చిబాబుతో కలిసి సెట్స్ పైకి వెళ్లనున్నాడని అంటున్నారు. చరణ్ కి ఇది 16వ సినిమా అవుతుంది. గతంలో 'రంగస్థలం' కోసం విలేజ్ సెట్ వేసిన ప్రదేశంలోనే, ఈ సినిమా కోసం ఒక భారీ సెట్ వేస్తున్నారని సమాచారం. సినిమాలో ఎక్కువ భాగం షూటింగ్ ఇక్కడే జరుగుతుందని అంటున్నారు. ఏఆర్.రెహ్మాన్ ఈ సినిమాకి సంగీతాన్ని అందిస్తూ ఉండటం విశేషం.