సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 8 అక్టోబరు 2020 (15:50 IST)

దసరాకి ప్రభాస్ అభిమానులకు బంపర్ ఆఫర్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాథేశ్యామ్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి జిల్ ఫేమ్ రాథాకృష్ణ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. యు.వి.క్రియేషన్స్ ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తుంది. ఇందులో ప్రభాస్ సరసన క్రేజీ హీరోయిన్ పూజా హేగ్డే నటిస్తుంది. రీసెంట్‌గా రాథేశ్యామ్ టీమ్ ఇటలీ వెళ్లారు. అక్కడ ప్రభాస్, పూజా హేగ్డేపై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.
 
ఈ సినిమతో పాటు నాగ్ అశ్విన్‌తో ఓ సినిమా, బాలీవుడ్ మూవీ ఆదిపురుష్‌లో ప్రభాస్ నటిస్తున్నారు. అయితే.. రాథేశ్యామ్ సినిమా గురించి అప్‌డేట్స్ రావడం లేదు. నాగ్ అశ్విన్ సినిమా, ఆదిపురుష్ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ అప్పుడప్పుడు వస్తున్నాయి దీంతో.. రాధే శ్యామ్ ప్రమోషన్ పరంగా కాస్త వెనుకపడిందని చెప్పచ్చు.
 
అయితే... ప్రభాస్ పుట్టినరోజైన అక్టోబర్ 23న రాథేశ్యామ్ టీజర్ రిలీజ్ చేయనున్నట్టు వార్తలు వస్తున్నాయి. లేటెస్ట్ అప్‌డేట్ ఏంటంటే... ప్రభాస్ అభిమానులను ఖుషీ చేయడానికి పుట్టినరోజు కంటే ముందుగానే విజయదశమికి రాధే శ్యామ్ టీజర్‌ను రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఈ సినిమాతో పాటు ఆదిపురుష్, నాగ్ అశ్విన్‌తో చేయనున్న సినిమాకి సంబంధించి కూడా అప్‌డేట్ రానుందని టాక్. ఇదే కనుక నిజమైతే ప్రభాస్ అభిమానులకు బంపర్ ఆఫరే.