1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By pyr
Last Updated : మంగళవారం, 4 ఆగస్టు 2015 (06:08 IST)

రాజమౌళికి రూ.20 కోట్ల ఆఫర్... ఎవరు ?

బాహుబలితో ఆ సినిమా దర్శకుడు యస్‌.యస్‌. రాజమౌళి పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోతోంది. దానికి తగ్గట్లుగానే హిందీ నిర్మాతలైతే ఆయనకు ఏకంగా రూ. 20 కోట్ల ఆఫర్ ఇచ్చేందుకు సిద్ధమైపోయారు. మరి జక్కన్న ఏమన్నారు...? సరేనన్నారా..? ఆ సినమా ఏది? 
 
‘బాహుబలి’ హిందీ డబ్బింగ్‌ వెర్షన్‌ను విడుదల చేసిన కరణ్‌ జోహార్‌‌కు బాహుబలి సినిమాలోని పస తెలిసిపోయింది. అందుకే తన బేనర్‌లో సినిమా డైరెక్ట్‌ చేయడానికి ఏకంగా రూ. 20 కోట్ల పారితోషికం ఇచ్చేందుకు సిద్ధపడినట్లు వినిపిస్తోంది. ఇలా ఒకరిద్దరు కాదు చాలా మంది నిర్మాతలు రాజమౌళి దగ్గరకు క్యూ కడుతున్నారు. 
 
సాజిద్‌ నదియడ్‌వాలా, సిద్ధార్థ్‌రాయ్‌ కపూర్‌ (డిస్నీ ఇండియా), సునీల్‌ లుల్లా (ఈరోస్‌ ఎంటర్‌టైన్‌మెంట్‌) వంటి నిర్మాతలు కూడా రాజమౌళితో సంప్రదింపులు జరిపేందుకు ఉత్సాహం చూపిస్తున్నారట. అయితే రాజమౌళికి నాలుగేళ్ల క్రితమే ‘విక్రమార్కుడు’ బాలీవుడ్‌ రీమేక్‌ అయిన ‘రౌడీ రాథోర్‌’ను డైరెక్ట్‌ చేసే అవకాశాన్ని సంజయ్‌లీలా భన్సాలీ ఇచ్చారట. అయితే అప్పటికే ‘బాహుబలి’ రూపకల్పనలో నిమగ్నమయిన రాజమౌళి తిరస్కరించారట. ప్రస్తుతం ఆయన బాహుబలి సీక్వెల్‌ పనిలో ఉన్నారని రాజమౌళి సన్నిహిత వర్గాల ద్వారా తెలిసింది.