మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Updated : బుధవారం, 9 అక్టోబరు 2019 (12:44 IST)

బన్నీ చెప్పింది నాకు కిక్ ఇవ్వలా, సైరా రిజల్ట్ గురించి చిరంజీవి

మెగాస్టార్ చిరంజీవి న‌టించిన తాజా చిత్రం సైరా న‌ర‌సింహా రెడ్డి. స్టైలీష్ డైరెక్ట‌ర్ సురేంద‌ర్ రెడ్డి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన ఈ సంచ‌ల‌న చిత్రం గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా అక్టోబర్ 2న ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చింది. స‌క్స‌స్‌ఫుల్‌గా ర‌న్ అవుతోంది. అయితే... ఈ సినిమా రిజెల్ట్ గురించి చిరంజీవి టెన్ష‌న్ ప‌డ్డార‌ట‌. ఈ విష‌యాన్ని స్వ‌యంగా చిరంజీవి మీడియాతో పంచుకున్నారు. 
 
సైరా రిజెల్ట్  గురించి చిరు ప‌డిన టెన్ష‌న్ ఆయ‌న మాట‌ల్లోనే.... ''మామూలుగా అయితే నాలుగు గంటలకు అమెరికా నుండి ఫోన్ వస్తుంది. రెండు మూడు ఫోన్ కాల్స్ రావాలి. అవి రాలేదు.
 
దేవిశ్రీ ప్రసాద్ మాత్రం రాత్రి 12:30కి ఒక వాయిస్ మెసేజ్ చేసాడు. అతను ఫారెన్‌లో ఉన్నాడు. ఇప్పుడే ఫస్ట్ హాఫ్ అయ్యింది, ఫెంటాస్టిక్ రిపోర్ట్ అని తన స్టైల్‌లో చెప్పాడు. 
 
సెకండ్ హాఫ్ చూడడానికి వెళుతున్నా అంటూ మెసేజ్ పెట్టాడు. అయితే మార్నింగ్ 3:30, 4 అయ్యింది, అప్పటికి సెకండ్ హాఫ్ అయిపోయి ఉంటుంది. కానీ అతని నుండి నో మెసేజ్. 4 గంటలకు రావాల్సిన ఫోన్ కాల్స్ రాలేదు. ఉదయం 6:30 అయ్యింది. ఎలాంటి మెసేజ్‌లు రాలేదు.. ఎలాంటి ఫోన్స్ రాలేదు. ఎక్కడో చిన్న టెన్షన్, నా వైఫ్‌కి రావాల్సిన మెసేజ్‌లు కూడా రాలేదు. 
 
ఎక్కడ నుండి ఏ కాల్స్ రాలేదు. భారంగా పేపర్స్ తిరగేస్తున్నాం. సెకండ్ హాఫ్ చూసి డిసప్పాయింట్ అయ్యారా?. అంత హుషారుగా ఫస్ట్ హాఫ్‌కి ఫోన్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ చెయ్యలేదేంటి? అని టెన్ష‌న్ ప‌డ్డాను. 
 
'ఉదయం 7 గంటలకు వాయిస్ మెసేజ్ వచ్చింది బన్నీ దగ్గరినుండి. ఇప్పుడే కృష్ణా జిల్లా నుండి బన్నీ వాస్ చేసాడు, సూపర్ రిపోర్ట్ అంట అని అన్నాడు. మన ఇంట్లో మనిషి మనం చేసే అన్ని సినిమాలు బావుండాలని కోరుకుంటాడు, అందుకే బన్నీ చెప్పింది నాకు కిక్ ఇవ్వలా... సర్లే చెబుతుంటాడులే, బయట చెప్పిన వాళ్ళదే కదా రిపోర్ట్ అని. 8 గంటలకు మెసేజ్ వచ్చింది. అక్కడి నుండి ఫోన్స్ స్టార్ట్ అయ్యాయి. బావుందండి, చాలా బావుందండి అంటున్నారు. 
 
యూవీ క్రియేషన్స్ విక్కీ ది బెస్ట్ రిపోర్ట్ ఇచ్చాడు. తరువాత సీడెడ్ నుండి వచ్చింది. ఆ తరువాత అమెరికా నుండి కాల్ వచ్చింది. ఏమయ్యింది ఇంత ఆలస్యం చేసావ్. చాలా టెన్షన్ పెట్టావ్. ఏమయ్యావ్ అన్నా అంటే... టికెట్స్ దొరకలేదు, నువ్వు టెన్షన్ పడతావ్ అని తెలుసు అంటూ అతని బాధ అతను చెప్పుకొచ్చాడు. గంటలు గడిచేకొద్దీ చాలా స్ట్రాంగ్ రిపోర్ట్ వచ్చింది. అప్పుడు రిలీఫ్ అయ్యా'' అంటూ చిరంజీవి సైరా రిలీజ్ రోజు పడిన టెన్షన్‌ని వివరించారు.