బుర్రకథ ట్రైలర్.. బాగానే ఉంది కానీ...?
ఆది, సాయికుమార్ నటించిన తాజా చిత్రం బుర్రకథ. ఈ చిత్రం ద్వారా డైమండ్ రత్నబాబు దర్శకుడుగా పరిచయం కానున్నారు. ఆది సరసన మిస్టీ చక్రవర్తి నటించింది. దీపాల ఆర్ట్స్ బ్యానర్‌పై హెచ్.కె. దీపాల ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. విభిన్న కథాంశంతో రూపొందుతోన్న ఈ సినిమా ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతోంది. ఈ సందర్భంగా బుర్రకథ ట్రైలర్ రిలీజ్ చేసారు. విక్టరీ వెంకటేష్ ఈ ట్రైలర్‌ను రిలీజ్ చేయడం విశేషం.
ఇక ట్రైలర్ గురించి చెప్పాలంటే.. ఈ చిత్రంలోని హీరో ఆదికి రెండు బ్రెయిన్లు ఉంటాయి. అయితే.. ఒక బ్రెయిన్ ఒకలా.. మరో బ్రెయిన్ మరొలా పని చేస్తూ ఉండడంతో ఆయన అలవాట్లలోను.. అభిరుచుల్లోను వెంటవెంటనే వేరియేషన్స్ కనిపిస్తూ వుంటాయి. ఇలా రెండు బ్రెయిన్స్ వల్ల ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు..? అతనికి వచ్చిన సమస్య ఏంటి..? ఆ సమస్య నుంచి ఎలా బయటపడ్డాడు అనేదే ఈ సినిమా కథ అని తెలుస్తుంది.
ఈ ట్రైలర్ ఎండింగ్‌లో కమెడియన్ 30 ఇయర్స్ పృథ్వీ సాహో టీజర్‌లో డైలాగ్ చెప్పడం హైలెట్‌గా నిలిచింది. మొత్తానికి బుర్రకథ ట్రైలర్ చాలా ఇంట్రస్టింగ్‌గా ఉంది. ఆది కెరీర్లో బాగా వెనకబడడంతో సక్సస్ కోసం సెంటిమెంట్‌ని నమ్ముకుని విక్టరీ వెంకటేష్‌తో ట్రైలర్ రిలీజ్ చేయించారు కానీ... రిలీజ్ డేట్ సరైంది కాదు. సమ్మర్లో రిలీజ్ చేసుంటే బాగుండేది. ఖచ్చితంగా ప్లస్ అయ్యేది అంటున్నారు సినీ జనం. మరి... బుర్రకథ ఎలాంటి ఫలితాన్ని అందిస్తుందో చూద్దాం.