ప్రైవేట్ జెట్‌నే బుక్ చేసుకున్న హీరోయిన్... ఎందుకో తెలుసా?

ముంబై నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామ పూజా హెగ్డే. 'రంగస్థలం' చిత్రంలో జిగేల్ రాణి ఐటమ్ సాంగ్‌లో తన అందచందాలను ఆరబోసింది. ఆ తర్వాత ఆమె వరుస ఆఫర్లను చేజిక్కించుకుంది. ఫలితంగా క్షణం తీరికలేక

pooja hegde
pnr| Last Updated: శనివారం, 8 సెప్టెంబరు 2018 (15:54 IST)
ముంబై నుంచి తెలుగు ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన భామ పూజా హెగ్డే. 'రంగస్థలం' చిత్రంలో జిగేల్ రాణి ఐటమ్ సాంగ్‌లో తన అందచందాలను ఆరబోసింది. ఆ తర్వాత ఆమె వరుస ఆఫర్లను చేజిక్కించుకుంది. ఫలితంగా క్షణం తీరికలేకుండా గడుపుతోంది.
 
టాలీవుడ్‌లోని ఇతర హీరోయిన్లతో పోల్చుకుంటే పూజా హెగ్డే చాలా బిజీగా ఉంది. ఒకేసారి నాలుగు సినిమాల్లో నటించేస్తోంది. అన్నీ అగ్రహీరోల సినిమాలేకావడం గమనార్హం. వారిలో జూనియర్ ఎన్టీఆర్, మహేష్, ప్రభాస్ చిత్రాలు ఉన్నాయి. ఈ మూడూ సెట్స్‌పై ఉన్నాయి. ఇకపోతే, బాలీవుడ్‌లో 'హౌస్ ఫుల్ 4' వంటి క్రేజీ మూవీలో అక్షయ్ కుమార్ వంటి సూపర్ స్టార్ సరసన నటిస్తోంది. 
 
అయితే ఈ సినిమాలన్నీ సెట్స్‌పై స్పీడందుకోవడంతో పూజాకి ఊపిరి సలపడం లేదు. ఒక సెట్ నుంచి ఇంకో సెట్‌కి హడావుడి హడావుడిగా పరుగులు తీస్తోంది. ఇలా ఓ చోట షూట్ పూర్తయ్యింది అనగానే వేరొక షెడ్యూల్ తరుముకు రావడంతో పూజా నానా హైరానా పడిపోతోంది. 'అరవింద సమేత', 'మహర్షి' చిత్రాలతో బిజీగా ఉంది. ఇంతలోనే ప్రభాస్ తన సినిమాని కూడా లాంచ్ చేశారు. ఇకపై ఈ సినిమా రెగ్యులర్ షూట్‌తో పూజాకి ఊపిరి సలపదు. అలానే హౌస్ ఫుల్ 4 చిత్రీకరణ స్వింగ్‌లో ఉంది. దీనివల్ల ఎన్టీఆర్, మహేష్ సినిమాల్ని బ్యాలెన్స్ చేస్తూ ఆ రెండు చిత్రాల సెట్స్‌కి వెళ్లాల్సొస్తోంది.
 
ఇందుకోసం ఆమె ఏకంగా ఓ ప్రైవేట్ జెట్‌నే వినియోగిస్తోంది. ఇందుకోసం పూజా హెగ్డే ఏకంగా లక్షలాది రూపాయలను అద్దెకు చెల్లిస్తోంది. ముఖ్యంగా, హౌస్‌ఫుల్ 4 సినిమా షూటింగ్ జై సల్మేర్ లాంటి విమాన సౌకర్యం లేని ప్రాంతాల్లో సాగుతోంది. ఇక్కడకు వెళ్లేందుకు రోజుకు కేవలం ఒక్క ఫ్లైట్ మాత్రమే ఉంటుంది. దాంతో ఆ విమానం దొరక్క పూజా హైదరాబాద్ నుంచి ఏకంగా ఓ ప్రైవేట్ జెట్‌ని బుక్ చేసుకోవడం గమనార్హం. పూజా హెగ్డేకు తన వృత్తిపట్ల ఉండే నిబద్ధతపై చిత్ర యూనిట్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తోంది. దీనిపై మరింత చదవండి :