1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : శుక్రవారం, 3 జులై 2015 (11:47 IST)

క్యాలెండర్ గర్ల్స్ టీజర్ రిలీజ్: మధుర్ భండార్కర్ కొత్త ప్రయోగం హిట్టేనా?

శృంగార తార సిల్క్ స్మిత జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన డర్టీ పిక్చర్‌ హిట్టయిన నేపథ్యంలో.. మోడల్స్ ఆధారంగా కొత్త సినిమా రూపుదిద్దుకోనుంది. ఐదుగురు మోడల్స్‌, వారి జీవితంలో జరిగిన సంఘటనల ఆధారంగా బాలీవుడ్‌లో మధుర్‌ భండార్కర్‌ తెరకెక్కించిన చిత్రం 'క్యాలెండర్‌ గర్ల్స్‌'. ఈ చిత్రం టీజర్‌ గురువారమే విడుదల చేశారు. న్యూకమర్స్‌ అయిన అవని మోడీ, ఆకాంక్ష పూరి, సతరూప పాణె, కైనా దత్‌, రుషి సింగ్‌లు మోడల్స్‌గా నటించారు. ట్రైలర్‌ యుట్యూబ్లో విడుదలైంది. 
 
దీనిపై దర్శకుడు స్పందిస్తూ.. టిపికల్‌ స్టైల్లో సినిమా తెరకేక్కినట్టు ట్రైలర్‌ చూస్తే అర్ధం అవుతుంది. ట్రైలర్‌ టూ హాట్‌ అంటూ నెటిజన్లు కామెంట్‌ చేస్తున్నారు. ''క్యాలెండర్‌ ఫోటోషూట్‌ తర్వాత అమ్మాయిలు కనుమరుగవుతారు. వారు ఏమయ్యారు..? అనే ప్రశ్న నాలో ఆసక్తిని రేకెత్తించింది. కొందరు క్యాలెండర్‌ గర్ల్స్‌‌ను కలసి, పరిశోధించి కథను సిద్దం చేశా. కొందరు నటీమణులు అయితే, మరికొందరు మోడల్స్‌‌గా స్థిరపడ్డారు.
 
అందగత్తెల బికినీల గురించే మాత్రమే కాదు, వారి ప్రయాణంలో సంతోషకర క్షణాలు, స్ట్రగుల్స్‌ అన్నిటిని వెండితెరపై ఆవిష్కరించే ప్రయత్నం చేశాం. ఇతరులకు స్ఫూర్తినిచ్చే చిత్రమిది'' అని మధుర్‌ భండార్కర్‌ తెలిపారు. అయితే మధుర్ భండార్కర్ కొత్త ప్రయోగం తప్పక హిట్ అవుతుందని ఇప్పటికీ సినీ పండితులు జోస్యం చెబుతున్నారు.