శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 15 జులై 2023 (16:22 IST)

సహజీవనం.. ఆమె భర్తపై కార్తీక దీపం సీరియల్ నటుడు కాల్పులు

karthika deepam actor
karthika deepam actor
కార్తీక దీపం సీరియల్ నటుడు మనోజ్ కుమార్ శామీర్ పేట్ సెలెబ్రిటీ క్లబ్‌లో ఓ యువకుడిపై కాల్పులు జరిపాడు. ఈ ఘటనతో అప్రమత్తమైన యువకుడు అక్కడి నుంచి ఎలాగోలా తప్పించుకుని పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. 
 
ఓ మహిళతో సహజీవనమే ఈ కాల్పులకు కారణమని పోలీసుల ప్రాథమిక దర్యాప్తులో తేలింది. వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌కు చెందిన సిద్ధార్థదాస్‌, తన భార్య స్మిత 2019లో విడిపోయాడు. వీరికి ఒక కుమార్తె, కుమారుడు ఉన్నారు. అయితే భర్తతో విడిపోయిన స్మిత శామీర్‌పేట్‌ సెలబ్రిటీ క్లబ్‌లో ఉంటున్న సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగి, సీరియల్ నటుడు మనోజ్‌కుమార్‌తో సహజీవనం చేస్తోంది. 
 
ఈ క్రమంలో పిల్లల్ని చూసేందుకు ఇంటికొచ్చిన సిద్ధార్థపై ఎయిర్ గన్‌తో మనోజ్ కాల్పులు జరిపాడు. ఈ ఘటనలో తప్పించుకున్న సిద్ధార్థ శామీర్ పేట్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మనోజ్‌పై హత్యాయత్నం చేసు నమోదైంది.