శనివారం, 4 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : మంగళవారం, 29 జూన్ 2021 (13:11 IST)

భూవివాద కేసులో నిర్మాత సి.కళ్యాణ్‌పై కేసు

హైదరాబాద్ నగరంలోని షేక్‌పేట భూవివాదంపై ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. అలాగే మరో ముగ్గురిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు. 
 
అమెరికాలో వైద్యుడిగా పని చేస్తున్న స్వరూప్‌.. 1985లో షేక్‌పేటలో ఫిలింనగర్‌ హౌసింగ్‌ సొసైటీ నుంచి భూమి కొనుగోలు చేశాడు. 2015లో నారాయణమూర్తి అనే వ్యక్తికి లీజుకు ఇచ్చాడు. నారాయణమూర్తి ఆస్థలంలో ఆర్గానిక్‌ స్టోర్‌ నడుపుతున్నాడు. 
 
అయితే సోమవారం సాయంత్రం నిర్మాత సి.కల్యాణ్‌ పంపిస్తే వచ్చామని.. షరూఫ్‌, శ్రీకాంత్‌, తేజస్వి కలిసి ఆర్గానిక్‌ స్టోర్‌కు తాళాం వేశారు. స్వరూప్‌ సోదరుడు ఫిర్యాదు చేయడంతో వీరి ముగ్గురితోపాటు సి.కల్యాణ్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.