Widgets Magazine

హల్లో మహేష్.. నీకు నాతో పోటీపడే దమ్ముందా.. జూ.ఎన్టీఆర్ ఛాలెంజ్ (వీడియో)

టాలీవుడ్ ' ప్రిన్స్' మహేష్ బాబుకు మరో తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ ఓ సవాల్ విసిరారు. అది ఫిట్నెస్ ఛాలెంజ్. మరి ఈ ఛాలెంజ్‌ను మహేష్ బాబు స్వీకరిస్తారా లేదా అన్నది ఇపుడు సినీ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారి

jr ntr
pnr|
టాలీవుడ్ ' ప్రిన్స్' మహేష్ బాబుకు మరో తెలుగు హీరో జూనియర్ ఎన్టీఆర్ ఓ సవాల్ విసిరారు. అది ఫిట్నెస్ ఛాలెంజ్. మరి ఈ ఛాలెంజ్‌ను మహేష్ బాబు స్వీకరిస్తారా లేదా అన్నది ఇపుడు సినీ ఇండస్ట్రీలో ఆసక్తికరంగా మారింది.
 
నిజానికి మలయాళ సినీనటుడు మోహన్ లాల్ తాజాగా యంగ్‌ టైగర్‌ ఎన్టీఆర్‌కు సామాజిక మాధ్యమాల్లో ఫిట్నెస్‌ ఛాలెంజ్‌ విసిరిన విషయం తెలిసిందే. దీన్ని జూనియర్ ఎన్టీఆర్ స్వీకరించారు. ఈ ఛాలెంజ్ మేరకు గురువారం జిమ్‌లో వ్యాయామం చేస్తూ తీసుకున్న వీడియోను తన ట్విట్టర్‌ ఖాతాలో పోస్ట్ చేశాడు. 
 
తాను మామూలుగానే తన ఫిట్నెస్‌ ట్రైనర్‌ ఆధ్వర్యంలో రెగ్యులర్‌గా వ్యాయామం చేస్తానని చెప్పాడు. అదేసమయంలో ఇక ఆయన మహేశ్‌ బాబు, నందమూరి కల్యాణ్‌ రామ్‌, రామ్‌ చరణ్‌, రాజమౌళి, కొరటాల శివకు "హమ్ ఫిట్‌తో ఇండియా ఫిట్" ఛాలెంజ్ చేశారు. 
 
అయితే, రామ్‌ చరణ్‌ తేజ్‌కు ట్విట్టర్‌ అకౌంట్‌ లేకపోవడంతో.. తాను చేసిన సవాల్ విషయాన్ని చెర్రీతో చెప్పాలని ట్విట్టర్‌లో ఉపాసనను కోరారు. కాగా, కేంద్ర మంత్రి రాజ్యవర్థన్‌ సింగ్‌ రాథోడ్‌ ప్రారంభించిన ఈ ఛాలెంజ్‌ను దేశంలోని చాలా మంది సెలబ్రిటీలు స్వీకరిస్తోన్న విషయం తెలిసిందే. ఇది గొలుసు లింకులా దేశ వ్యాప్తంగా వ్యాపిస్తోంది. 

 


దీనిపై మరింత చదవండి :