1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By దేవీ
Last Updated : మంగళవారం, 27 మే 2025 (17:07 IST)

ఆదర్శవంతమైన పాలకులుగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలయిక : నారా రోహిత్

Nara Rohit
Nara Rohit
తన కెరీర్లో సోలో, రౌడీ ఫెలో, బాణం, జోఅచ్చుతానంద, అప్పట్లో ఒకడుండేవాడు ఇష్టమైన సినిమాలు అని హీరో నారా రోహిత్ తెలియజేస్తున్నారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్, మంచు మనోజ్ తో కలిసిన నటించిన యాక్షన్ థ్రిల్లర్ భైరవం. విజయ్ కనకమేడల దర్శకత్వంలో కె.కె. రాధామోహన్ నిర్మించారు. పెన్ స్టూడియోస్ డాక్టర్ జయంతీలాల్ గడా సమర్పిస్తున్నారు. ఈ సినిమా మే 30న సమ్మర్ సీజన్‌లో బిగ్గెస్ట్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో హీరో నారా రోహిత్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాలు పంచుకున్నారు.
 
- ఈ కథ నాకు నిర్మాత బెల్లంకొండ సురేష్ గారు ఫోన్ చేసి చెప్పారు. ఆయన జడ్జిమెంట్ మీద నాకు నమ్మకం ఉంది. శశి కుమార్ క్యారెక్టర్ గురించి చెప్పారు. నేను సినిమా చూశాను. చాలా నచ్చింది. ఇది యూనివర్సల్ సబ్జెక్ట్. తమిళ్లో దీన్ని ఒక రస్టిక్ విలేజ్ డ్రామా లా చేశారు. దిన్ని తెలుగు నేటివిటికి తగ్గట్టు చేంజెస్ చేయడం జరిగింది.  గరుడన్ చూసిన తర్వాత కూడా ఈ సినిమా చూస్తే ఒక ఒరిజినల్ ఫిల్మ్ చూసిన ఫీలింగ్ కలుగుతుంది.
 
- కొన్ని సినిమాలు చేశాక చిన్న బ్రేక్ తీసుకోవాలనుకున్నాను. అది కాస్త పెద్ద బ్రేక్ అయింది. ఇకపై రెగ్యులర్ గా సినిమాలు వస్తాయి. సుందరకాండ ఆల్మోస్ట్ పూర్తయింది. జూలైలో రిలీజ్ ఉండొచ్చు. నెక్స్ట్ ఫిల్మ్ ఆగస్టులో స్టార్ట్ చేయబోతున్నాను.  
 
- మనోజ్ నాకు చిన్నప్పటినుంచి తెలుసు. ఈ సినిమాతో చాలా పర్సనల్ బాండ్ వచ్చింది. సాయి నాకు 2010 నుంచి తెలుసు. తను డాన్స్ ప్రాక్టీస్ చేస్తుండేవాడు. అప్పటినుంచి తను పరిచయం. నిజానికి సురేష్ గారితో ఒక సినిమా చేయాలి.కానీ అది కుదరలేదు. ఈ సినిమాతో  మేమంతా మరింత  దగ్గరయ్యాం.
 
- ఇందులో జయసుధ గారు బామ్మ క్యారెక్టర్ చేశారు. జయసుధగారు లెజెండరీ. సార్ వచ్చారు చిత్రం తర్వాత వారితో  వర్క్ చేయడం ఆనందాన్ని ఇచ్చింది.
 
- నేను యాక్షన్ సినిమాలు చేశాను కానీ ఇంత కమర్షియల్ మాస్ ఫిలిం నేనెప్పుడూ చేయలేదు. ఇది నాకు ఒక కొత్త ఎక్స్పీరియన్స్. ఆడియన్స్ రెస్పాన్స్ కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాను.
 
- ఈ సినిమాలో చాలా యాక్షన్ సీక్వెన్స్ ఉన్నాయి. యాక్షన్ సీక్వెన్స్ లు ఈ సినిమాకి మేజర్ హైలైట్. చాలా రోజుల తర్వాత ఇంత హెవీ యాక్షన్ చేయడం చాలా ఎంజాయ్ చేశాను. మేము ముగ్గురు కలిసి చేసిన ఇంటర్వెల్ సీక్వెన్స్ చాలా అద్భుతంగా వచ్చింది. ఆడియన్స్ కి చాలా మంచి ఎక్స్పీరియన్స్ ఉంటుంది .
 
- ఈ సినిమాలో ప్రతి క్యారెక్టర్ కి ఇంపార్టెన్స్ ఉంటుంది. ఇంపార్టెన్స్ లేని క్యారెక్టర్ ఉండదు. ఒరిజినల్ గా ఇది వెట్రిమోరన్ గారి కథ. ప్రతి పాత్రకి కథలో చాలా కీలక పాత్ర ఉంటుంది.
 
- శ్రీ చరణ్ బ్యాక్గ్రౌండ్ స్కోరు బాగా చేస్తాడనే పేరు ఉంది. ఈ సినిమాతో మంచి పాటలు కూడా ఇస్తాడని ప్రూవ్ చేసుకున్నాడు. ఈ సినిమాలో బ్యాగ్రౌండ్ స్కోరు మెయిన్ హైలెట్ గా ఉంటుంది. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో తన సినిమాని ఎలివేట్ చేశాడు
 
- విజయ్ చాలా క్లియర్ విజన్ తో ఉంటాడు. తనకి ఏం కావాలో ఫుల్ క్లారిటీ ఉంటుంది. అలాగే ఒక సీన్ తీస్తున్నప్పుడే ఎడిటింగ్ పాటర్న్ తన మైండ్లో ఉంటుంది. ఈ సినిమా తను చాలా పెద్ద కమర్షియల్ డైరెక్టర్ అని ప్రూవ్ చేసుకునేలా ఉంటుంది.
 
- మా కజిన్స్ తో కలిసి సుందరకాండ చేస్తున్నాను.  మంచి కథలు వస్తే తప్పకుండా సినిమాలు నిర్మిస్తాను.
 
- నాకు హారర్ తప్ప అన్ని సినిమాలు ఇష్టం. డబ్బులు ఇచ్చి భయపడడం ఎందుకని ఆలోచన వస్తుంది.
 
- రాజకీయాల్లోకి వెళ్ళే ఆలోచనలేదు. కానీ అన్ని పరిశీలిస్తాను. ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబుగారితో పవన్ గారు కలిసి పనిచేయడం, ఏడాదిపాటు చాలా మంచి పనులు చేయడం చాలా ఆనందంగా వుంది. భవిష్యత్ తరానికి వీరి కలయిక ఆదర్శంగా నిలుస్తుంది.