బుధవారం, 18 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 4 ఫిబ్రవరి 2021 (14:20 IST)

ట్రెండింగ్‌లో నితిన్ చెక్.. ప్రియా ప్రకాష్ వారియర్, రకుల్ హీరోయిన్లుగా?

Check
టాలీవుడ్‌లోని యువ హీరో నితిన్ గత ఏడాది భీష్మ సినిమాతో కెరీర్ బ్లాక్ బస్టర్ హిట్ కొట్టాడు. ప్రస్తుతం నితిన్ వరుస సినిమాలు చేస్తూ బిజీగా ఉన్నారు. నితిన్ హీరోగా తాజాగా తెరకెక్కుతున్న సినిమా చెక్. ఈ సినిమాలో ప్రియా ప్రకాష్ వారియర్, రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌లుగా చేస్తున్నారు. ఈ సినిమాను యేలేటి చంద్రశేఖర్ దర్శకత్వంలో ఆనంద్ ప్రసాద్ నిర్మిస్తున్నారు. 
 
అయితే తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదలైన విషయం తెలిసిందే. ఈ ట్రైలర్ అందరి దృష్టి ఆకర్షించింది. ప్రస్తుతం ఈ ట్రైలర్ యూట్యూబ్‌లో హ్యాష్ ట్యాగ్ నెంబర్ వన్‌గా ట్రెండ్ అవుతుంది. ఈ సినిమాపై ప్రేక్షకులకు ఉన్న అంచనాలను ఈ ట్రైలర్ అమాంతం పెంచేసింది. ఈ ట్రైలర్‌లో నితిన్ ఓ ఖైదీగా కనిపించడం ప్రేక్షకుల్లో ఆసక్తిని కలిగించింది.
 
నితిన్ అభిమానులు ఈ సినిమా విడుదల కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇదిలా ఉంటే ఈ సినిమాలో సిమ్రాన్ చౌదరి, పోసాని కష్ణమురళి, సంపత్ రాజ్, మురళి శర్మ తదితరులు కీలక పాత్రల్లో కనిపించనున్నారు.