శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : మంగళవారం, 7 మార్చి 2017 (18:11 IST)

చిన్మయికి అత్యాచార బెదిరింపులు.. ఫ్యాన్స్‌ సాయంతో వారిని పట్టేసింది..

సింగర్ చిన్మయి శ్రీపాదకి అత్యాచారం చేస్తామని బెదిరింపులు వచ్చాయి. అయితే దీనిపై ఆమె పోరాడింది. రెండేళ్ల క్రితం టెర్రరిజంతో సంబంధాలున్నాయని 3,60,000 ఖాతాలనే ఆపేశారని.. అలాంటి తరహా చర్యలే మహిళలను వేధిస్త

సింగర్ చిన్మయి శ్రీపాదకి అత్యాచారం చేస్తామని బెదిరింపులు వచ్చాయి. అయితే దీనిపై ఆమె పోరాడింది. రెండేళ్ల క్రితం టెర్రరిజంతో సంబంధాలున్నాయని 3,60,000 ఖాతాలనే ఆపేశారని.. అలాంటి తరహా చర్యలే మహిళలను వేధిస్తున్న వారిపై కూడా ట్విట్టర్ యాజమాన్యం తీసుకోవాలని చిన్మయి డిమాండ్ చేసింది.  

ట్విట్టర్లో కొంతమంది ఆమెని అత్యాచారం చేస్తామని.. యాసిడ్ చల్లుతామని బెదిరించారని.. కానీ తాను ఫ్యాన్స్ సాయంతో తనను వేధించిన వారిని పట్టుకున్నానని.. ఎట్టకేలకు ముగ్గురిని అరెస్ట్ చేసి పది రోజుల పాటు పోలీసులు జైలులో పెట్టారని చిన్మయి తెలిపింది. 
 
తాను సెలబ్రిటీని కావున పోరాడానని, అలా ఫైట్ చేయలేని సాధారణ మహిళల పరిస్థితి ఏమిటి? అంటూ ప్రశ్నించింది. మహిళలకు హాని జరగకుండా చూసుకోవాల్సిన బాధ్యత ట్విట్టర్ దేనని, అందుకే ట్విటర్‌లో వేధిస్తున్నవాళ్లకి సమాధానం ఇవ్వాలనే పిటిషన్‌ వేసినట్టు చెప్పుకొచ్చింది.

తనను వేధిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని ట్విట్టర్ యాజమాన్యానికి ఆన్‌లైన్‌ పిటిషన్‌ వేశారు. ట్విట్టర్‌కు ఫిర్యాదు చేస్తే వాళ్లు పోలీసు కేసు లేనిదే పట్టించుకోలేమన్నారని చిన్మయి తెలిపింది. ఈ విషయం సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది.