గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 14 జులై 2023 (10:26 IST)

సీఎం స్టాలిన్ వైరముత్తును కలవడమా? డీఎంకేతో సపోర్ట్‌తో.. MeTooపై గొంతెత్తినా?

Chinmayi Sripada
తమిళ సంగీత దర్శకుడు వైరముత్తు ఇటీవల 70వ పుట్టినరోజు జరుపుకున్నారు. సినీ ప్రముఖులు, రాజకీయ నేతలు పలువురు ఆయనకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంలో తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కె.స్టాలిన్ బెసెంట్ నగర్‌లోని వైరముత్తు నివాసానికి వెళ్లి శుభాకాంక్షలు తెలిపారు.
 
ఈ సందర్భంలో, ఇది చూసి కలత చెందిన గాయని చిన్మయి సోషల్ మీడియాలో ఒక పోస్ట్ షేర్ చేసింది. అందులో, "తమిళనాడు ముఖ్యమంత్రి తన పుట్టినరోజున చాలా మంది మహిళలపై లైంగిక వేధింపులకు పాల్పడిన వ్యక్తిని స్వయంగా సందర్శించారు. నేను లైంగిక ఫిర్యాదు చేసినందుకు 2018 నుండి తమిళ చిత్ర పరిశ్రమలో పని చేయకుండా నిషేధించబడిన బహుళ అవార్డు పొందిన గాయకుడిని. MeToo ఉద్యమం ద్వారా ఈ కవికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశాను. 
 
ఈ కవి ఏ స్త్రీనైనా తాకవచ్చునని నిర్ణయించుకున్నాడు. మహిళలను వేధించడానికే ఆయన పుట్టాడు. అనేక మంది రాజకీయ నాయకులతో, ముఖ్యంగా తమిళనాడులో ప్రస్తుతం అధికారంలో వున్న డీఎంకేతో ఉన్న సాన్నిహిత్యం కారణంగా చాలామంది మహిళలను బెదిరించి లొంగదీసుకున్నాడు. 
 
తమిళనాడు రాజకీయ నాయకులు మహిళల భద్రత గురించి మాట్లాడటం సిగ్గుచేటు. వైరముత్తు గురించి మాట్లాడినప్పుడల్లా అందరూ సైలెంట్ అవుతారు.. అంటూ చిన్మయి తీవ్రస్థాయిలో రాజకీయ నేతలపై మండిపడ్డారు.