చిరంజీవి-నాగార్జునలో మంత్రి తలసాని, టాలీవుడ్ వెరీ స్ట్రాంగ్, అదే కేసీఆర్ ప్లాన్

Talasani
డివి| Last Modified సోమవారం, 10 ఫిబ్రవరి 2020 (21:06 IST)
తలసానితో చిరు-నాగ్
జూబ్లిహిల్స్‌లోని అన్నపూర్ణ స్టూడియోలో చిరంజీవి, నాగార్జునలతో సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ సమావేశం నిర్వహించారు. చిత్రపరిశ్రమ అభివృద్ధి, సినీ కళాకారుల సంక్షేమానికి చేపట్టాల్సిన చర్యలు, తదితర అంశాలపై హోమ్, రెవెన్యూ, న్యాయశాఖ, కార్మిక శాఖ తదితర శాఖల అధికారులతో సమీక్షించారు.

ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కోసం శంషాబాద్ పరిసరాలలో స్థలం సేకరించాలని రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కల్చరల్ సెంటర్, స్కిల్ డవలప్‌మెంట్ కేంద్రం కోసం అవసరమైన స్థలాలు సేకరణ చెయాలని సూచన చేశారు.

సినీ, టివి కళాకారులకు ఇండ్ల నిర్మాణం కోసం 10 ఎకరాల స్థలాన్ని సేకరించాలని ఆదేశించారు. సింగిల్ విండో విధానంలో షూటింగ్‌లకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయాలన్నారు. ఎఫ్‌డిసి ద్వారా కళాకారులకు గుర్తింపు కార్డులు అందించేందుకు చర్యలు చేపడతామని అన్నారు.

పైరసీ నివారణకు పకడ్బందీ చర్యలు తీసుకునేందుకు ప్రణాళికలు రూపొందిస్తామన్నారు.దీనిపై మరింత చదవండి :