మంగళవారం, 21 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : మంగళవారం, 18 జనవరి 2022 (19:02 IST)

రవితేజతో ఐదుగురు హీరోయిన్లు, జోక్ చేసిన మెగాస్టార్ చిరంజీవి, అసలు విషయం అదే...

Raviteja-chiru
రవితేజ హీరోగా క్రియేటివ్ డైరెక్టర్ సుధీర్ వర్మ కాంబినేషన్‌లో రాబోతున్న `రావణాసుర` సినిమాను సంక్రాంతి ప‌ర్వ‌దినం రోజున మెగాస్టార్ చిరంజీవి ఇతర అతిథుల‌ సమక్షంలో లాంఛనంగా ప్రారంభించిన సంగతి తెలిసిందే. అభిషేక్ పిక్చర్స్, ఆర్‌టీ టీం వర్క్స్ బ్యానర్లపై అభిషేక్ నామా ఈ చిత్రాన్ని భారీగా నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సెప్టెంబర్ 30న విడుదల చేయబోతోన్నట్టు మేకర్లు ప్రకటించారు.

 
కాగా, ప్రారంభం రోజునే ఫ‌స్ట్‌లుక్‌ను చిరంజీవి ఆవిష్క‌రిస్తూ, ఆల్ రౌండ‌ర్‌లా అన్ని పాత్ర‌లు పోషించిన నీకు ఈ గెట‌ప్ బాగా సూట‌యింద‌ని మెచ్చుకున్నారు. దీంతో అక్క‌డున్న నిర్మాత ద‌ర్శ‌కులు అంతా ఒక్క‌సారి న‌వ్వుకున్నారు. ఇలా స‌ర‌దాగా సాగిన ఈ ప్రారంభోత్స‌వం నేటి నుంచి రెగ్యుల‌ర్ షూటింగ్ ప్రారంభ‌మైంది. ఇక నుండి `రావణాసుర`పాలన ఆరంభం కానుంది. ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్‌ను చిత్రయూనిట్ ప్రారంభించింది. ప్రస్తుతం కీల‌క తారాగ‌ణంపై  నైట్ సీక్వెన్స్‌లను తెరకెక్కిస్తున్నారు.

 
రవితేజ ఈ చిత్రంలో న్యాయవాదిగా కనిపించబోతోన్నారు. రామ్ పాత్రలో సుశాంత్ ముఖ్యమైన రోల్‌లో నటిస్తున్నారు. ఈ చిత్రంలో మొత్తం ఐదుగురు హీరోయిన్లు న‌టిస్తున్నారు. అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడలు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ ఐదు పాత్రల‌కు కూడా మంచి ప్రాముఖ్యత ఉండ‌నుంది. 

 
రచయితగా శ్రీకాంత్ విస్సా కథను అందించారు. సుధీర్ వర్మ తన సినిమాలను ఎంత కొత్తగా, స్టైలీష్‌గా తెరకెక్కిస్తారో అందరికీ తెలిసిందే. ఈ చిత్రంలో రవితేజను ఇది వరకు ఎన్నడూ చూడని విధంగా చూపించబోతోన్నారు. పోస్టర్‌ను బట్టే మనకు ఆ విషయం అర్థమవుతోంది.

 
ఇక ఈ చిత్రానికి ప్రముఖ నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేయబోతున్నారు. హర్ష వర్దన్ రామేశ్వర్, భీమ్స్ కలిసి ఈ సినిమాకు సంగీతాన్ని అందిస్తున్నారు. విజయ్ కార్తీక్ కన్నన్ సినిమాటోగ్రఫర్‌గా, శ్రీకాంత్ ఎడిటర్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు.

 
నటీనటులు : రవితేజ, సుశాంత్, అను ఇమాన్యుయేల్, మేఘా ఆకాష్, ఫరియా అబ్దుల్లా, దక్ష నగార్కర్, పూజిత పొన్నాడ, రావు రమేష్,  మురళీ శర్మ, సంపత్ రాజ్, నితిన్ మెహత (అఖండ ఫేమ్), సత్య, జయ ప్రకాష్ తదితరులు