శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : శుక్రవారం, 4 జనవరి 2019 (15:10 IST)

'సైరా' తర్వాత చిరంజీవి సై... వేసవిలో కొరటాల చిత్రం

మెగాస్టార్ చిరంజీవి - డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్‌లో ఓ చిత్రంరానుంది. ఈ చిత్రం వచ్చే వేసవిలో సెట్స్‌పైకెళ్ళనుంది. నిజానికి చిరంజీవి ప్రస్తుతం "సైరా నరసింహా రెడ్డి'' అనే చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సురేందర్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం వేసవిలో ప్రేక్షకుల ముందుకురానుంది. ఆ తర్వాత చిరంజీవి తన కొత్త చిత్రాన్ని పట్టాలెక్కించనున్నారు. ఈ చిత్రంలో హీరోయిన్లుగా ఎవరికి ఛాన్స్ దొరకనుందనేది ఆసక్తికరంగా మారింది. 
 
అదేసమయంలో ఈ చిత్రానికి చిరు తనయుడు రాంచ‌ర‌ణ్ నిర్మాతగా వ్యవహరిస్తారనీ, ఆయన మైత్రీ మూవీ మేకర్స్ సంస్థతో కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తారనే ప్రచారం ఫిల్మ్ నగర్‌లో జోరుగా సాగుతోంది. ఈ సినిమాలో చిరంజీవి రైతుగాను, బిలియనీర్‌గాను ద్విపాత్రాభినయం చేస్తాడన్నది టాక్. ఈ చిత్రానికి సంబంధించిన స్క్రిప్టును ఇప్పటికే సిద్ధం చేశారు. ఈ చిత్రం సందేశాత్మక విలువలతో కూడిన చిత్రంగా ఉంటుదన్నది సమాచారం.