Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

చిరంజీవి - పవన్ కళ్యాణ్ మల్టీస్టారర్ ఫిల్మ్ ‌.. మాటల మాంత్రికుడి దర్శకత్వంలో...

గురువారం, 2 ఫిబ్రవరి 2017 (17:12 IST)

Widgets Magazine
chiru - pawan

మెగా బ్రదర్స్ చిరంజీవి, పవన్ కళ్యాణ్ కాంబినేషన్‌లో మల్టీస్టారర్ చిత్రం నిర్మితంకానుంది. ఈ చిత్రానికి మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కథను సిద్ధం చేసినట్టు సమాచారం. వారిద్దరి ఇమేజ్‌కు, భావాలకు అనుగుణంగా ఈ కథను తయారు చేసినట్టు తెలుస్తోంది. వాస్తవానికి చిరు-పవన్‌ కలిసి నటిస్తే చూడాలని ఆశిస్తున్న ప్రేక్షకుల చిరకాల కోరిక నెరవేరనుంది. ఈ కల ఇపుడు నెరవేరనుంది. వాస్తవానికి గతంలో "శంకర్‌దాదా జిందాబాద్" చిత్రంలో చిరంజీవి - పవన్ కళ్యాణ్‌లు కలిసి ఓ సన్నివేశంలో కనిపించి ఫ్యాన్స్‌ను ఆలరించారు. 
 
అయితే, చిరంజీవి తాజాగా నటించిన 'ఖైదీ నంబర్ 150'వ చిత్రం ప్రీ రిలీజ్ ఫంక్షన్ వేడుకల్లో పాల్గొన్న ప్రముఖ నిర్మాత టి.సుబ్బరామిరెడ్డి చిరంజీవి, పవన్‌లతో ఓ మల్టీస్టారర్‌ చిత్రాన్ని చేయనున్నట్లు ప్రకటించారు. ఆ ప్రకారంగానే ఆయన ఈ ప్రాజెక్టు గురించి గురువారం అధికారికంగా ప్రకటించారు. ప్రముఖ నిర్మాత సి. అశ్వినీదత్‌తో కలిసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నట్టు తెలుస్తోంది. 
 
ఈ చిత్రానికి త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌ దర్శకత్వం వహించనున్నట్లు వెల్లడించారు. ఈ నేపథ్యంలో చిరు, పవన్‌లతో సినిమా చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపారు. గతంలో సుబ్బరామిరెడ్డి 'జీవనపోరాటం'(1986), 'స్టేట్‌‌రౌడీ'(1989), 'గ్యాంగ్‌ మాస్టర్'‌(1994), భగవద్గీత(1993) చిత్రాలను నిర్మించారు. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

5న "స్వచ్ఛ్ హైదరాబాద్" క్రికెట్ మ్యాచ్... ఉమెన్ కార్పొరేటర్స్ వర్సెస్ హీరోయిన్లు

గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్ఎంసీ)తో కలిసి.. స్టార్స్ అండ్ క్రికెట్ ...

news

పెళ్లి చేసుకున్న శింబు - నయనతార... 'సరసుడు' హ్యాట్రిక్‌ హిట్‌ అవుతుంది

సినీ నటి నయనతార, తమిళ హీరో శింబులు ఎట్టకేలకు ఓ ఇంటివారయ్యారు. వీరిద్దరు పెళ్లి ...

news

'జయమ్ము నిశ్చయమ్మురా'లో సూబర్బ్ సినిమా.. శ్రీనివాస్ రెడ్డికి పవన్ విషెస్

కమెడియన్ శ్రీనువాస్ రెడ్డిని హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభినందించారు. చాలా అరుదుగా ...

news

దైవ సన్నిధిలో ప్రారంభమైన "పెళ్లి కథ"

శ్రీ రామాంజనేయ ఇంటర్నేషనల్ మూవీ కార్పొరేషన్ పతాకంపై అని శైని ఎంటర్‌టైన్‌మెంట్స్ ...

Widgets Magazine