Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

అల్లు శిరీష్‌ను ఇంటికి రమ్మన్న చిరంజీవి, ఎందుకో తెలుసా?

శుక్రవారం, 29 డిశెంబరు 2017 (15:26 IST)

Widgets Magazine
chiru

అల్లు అరవింద్ రెండవ కుమారుడు అల్లు శిరీష్‌ చాలా గ్యాప్ తరువాత ఒక్కక్షణం సినిమాతో మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఇద్దరు హీరోయిన్లతో చేసిన ఈ సినిమా నిన్న విడుదలై హిట్ టాక్‌తో ముందుకు వెళుతోంది. అల్లు శిరీష్ సినిమాను చూసిన మెగాస్టార్ చిరంజీవి అల్లు శిరీష్‌ను ఇంటికి రమ్మన్నారట. చిరంజీవి ఇంటికి ఎందుకు రమ్మంటున్నారో.. అది కూడా నన్ను మాత్రమే రమ్మంటున్నారు.. ఎందుకో అర్థం కాక అల్లు శిరీష్ భయంభయంగా ఉదయం ఇంటికి వెళ్ళాడట. 
 
అయితే చిరంజీవి అల్లు శిరీష్‌‌ను గట్టిగా హత్తుకుని బాగా చేశావ్ శిరీష్‌. నీ నటన చాలా బాగుంది. ఒక్క క్షణం సినిమా కథ కూడా చాలా బాగుంది. భావోద్వేగంతో నటించిన నీ నటన బాగా నచ్చిందంటూ ప్రశంసలతో శిరీష్‌‌ను ముంచెత్తారట చిరు. దీంతో శిరీష్‌ ఆనందానికి అవధుల్లేవట. నేరుగా ఇంటికి వెళ్ళిన అల్లు శిరీష్‌ తన తండ్రి అల్లు అరవింద్‌కు జరిగిన విషయాన్ని చెప్పాడట. చిరంజీవి లాంటి గొప్ప వ్యక్తి నన్ను మెచ్చుకోవడం నాకు ఎంతో సంతోషంగా ఉందని అన్నాడట.
 
గతంలో శ్రీరస్తు శుభమస్తు సినిమాతో మాత్రమే అల్లు శిరీష్‌ సక్సెస్ సాధించగా అంతకు ముందు నటించిన గౌరవం సినిమా ఫ్లాప్ అయ్యింది. మళ్ళీ హిట్ కోసం వెతుకుతూ చివరకు ఒక్క క్షణం సినిమాతో అల్లు శిరీష్‌ మరో విజయాన్ని సాధించుకున్నారు. చిరంజీవితో పాటు అన్న అల్లు అర్జున్ కూడా అల్లు శిరీష్‌ ను పొగడ్తలతో ముంచెత్తారట.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

ధనుష్ సినిమాలో వరలక్ష్మీ.. సాయిపల్లవి హీరోయిన్

కోలీవుడ్‌లో వరలక్ష్మి శరత్ కుమార్‌కు క్రేజ్ పెరిగిపోతోంది. వరుస సినిమాలతో తీరిక లేకుండా ...

news

కాశ్మీర్‌లో ''ఖావా'' తాగుతూ రేణూ దేశాయ్- ఇంకా వదినా అంటారేంటి బాబోయ్..!

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ కాశ్మీర్ ట్రిప్ ఎంజాయ్ చేస్తోంది. ...

news

అజ్ఞాతవాసిలో అదరగొట్టనున్న వెంకటేష్.. పవన్‌తో ఫైట్ సీన్?

అజ్ఞాతవాసి సినిమా కోసం పవన్ ఫ్యాన్స్ ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఈ సినిమాలో పవన్ పాడిన ...

news

చిరంజీవి మాట.. అందుకే అదృష్టంగా భావించి నవ్వుతూ సెల్ఫీ ఇస్తాను..

అల్లు శిరీష్, సురభి జంటగా నటించిన ''ఒక్క క్షణం'' సినిమా గురువారం విడుదలైంది. ఈ సినిమా ...

Widgets Magazine