శనివారం, 28 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: గురువారం, 7 మే 2020 (22:00 IST)

చిరు - శంకర్ కాంబినేషన్లో భారీ చిత్రం

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఆచార్య సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతోన్న ఆచార్య సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుందని సమాచారం. ఇదిలా ఉంటే... ఈ సినిమా తర్వాత చిరంజీవి లూసీఫర్ రీమేక్‌లో నటించనున్నారు. ఈ చిత్రానికి సాహో చిత్ర దర్శకుడు సుజిత్ దర్శకత్వం వహించనున్నారు. యు.వి.క్రియేషన్స్, కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ సంయుక్తంగా ఈ సినిమాని నిర్మించనున్నాయి. 
 
ప్రస్తుతం ఈ సినిమాకి సంబంధించి స్ర్కిప్ట్ వర్క్ జరుగుతుంది. ఈ సినిమా తర్వాత బాబీ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్నారు. ఆతర్వాత మెహర్ రమేష్ తో ఓ సినిమా చేయనున్నారు.
 
 ఈ విషయాన్ని స్వయంగా చిరంజీవి మీడియాకి తెలియచేసారు. అయితే.. తాజాగా చిరంజీవి - శంకర్ కాంబినేషన్లో ఓ భారీ చిత్రం ప్లాన్ జరుగుతుందని వార్తలు వస్తున్నాయి. వీరిద్దరి కాంబినేషన్లో మూవీ అంటూ గత కొంత కాలంగా వార్తలు వస్తూనే ఉన్నాయి కానీ.. అఫిషియల్ ఎనౌన్స్‌మెంట్ రాలేదు.
 
రీసెంట్‌గా ఓ బడా ప్రొడ్యూసర్ చిరు - శంకర్ కాంబినేషన్లో మూవీ సెట్ చేయడానికి ప్రయత్నిస్తున్నారని టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అభిమానులు కూడా ఈ కాంబినేషన్ కోసం ఎప్పటి నుంచో ఎదురుచూస్తున్నారు. 
 
రోబో ప్రీ రిలీజ్ ఫంక్షన్‌కి చిరు ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఆ టైమ్‌లో శంకర్ డైరెక్షన్లో చిరు సినిమా అంటూ జోరుగా వార్తలు వచ్చాయి. అప్పటి నుంచి వస్తూనే ఉన్నాయి. మరి.. ఇప్పుడు కాంబినేషన్ సెట్ అవుతుందేమో. అదే కనుక జరిగితే చిరు అభిమానులకు పండగే.