శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : గురువారం, 16 సెప్టెంబరు 2021 (22:26 IST)

‘లవ్ స్టోరీ’ ప్రీ రిలీజ్ ఈవెంట్‌కు మెగాస్టార్ చిరంజీవి

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా శేఖర్ కమ్ముల దర్శకత్వంలో తెరకెక్కిన ‘లవ్ స్టోరీ’ చిత్రం ఈ నెల 24న విడుదల కానుంది. ప్రస్తుతం ప్రమోషన్ యాక్టివిటీలో బిజీగా ఉంది యూనిట్. 
 
ఎప్పుడో విడుదల కావలసిన ఈ సినిమా పలు మార్లు వాయిదా పడి చివరకు 24న ఆడియన్స్ ముందుకు వస్తోంది. ఇక ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఈ నెల 19న జరగనుంది. మెగాస్టార్ చిరంజీవి ఈ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరు కాబోతున్నారు. 
 
ఈ సినిమాకు పవన్ సంగీతం అందించారు. ఈ చిత్రం నుంచి విడుదలైన నాలుగు పాటలు ఇప్పటికే సోషల్ మీడియాలో దుమ్ము రేపుతూ ట్రెండింగ్ లో ఉన్నాయి. దాంతో సినిమాపై భారీ అంచనాలున్నాయి. ‘ఫిదా’ తర్వాత శేఖర్ కమ్ముల తీసిన చిత్రం కావటంతో ఆడియన్స్‌లో క్యూరియాసిటీ ఉంది.