శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By Selvi
Last Updated : ఆదివారం, 30 ఏప్రియల్ 2017 (18:12 IST)

హైదరాబాద్‌కు వచ్చిన కోల్‌కతా యువతిపై అత్యాచారం.. మత్తుమందు కలిపిచ్చి..

హైదరాబాద్‌కు వచ్చిన కోల్‌కతా యువతి పట్ల నలుగురు దారుణంగా ప్రవర్తించారు. మాయమాటలతో నమ్మించి.. పక్కా ప్లాన్‌ ప్రకారం గదిలో బంధించి మరీ అత్యాచారం చేశారు. ప్రధాన నిందితుడు ప్రీత్‌ షెర్గిల్‌(39)ను పోలీసులు

హైదరాబాద్‌కు వచ్చిన కోల్‌కతా యువతి పట్ల నలుగురు దారుణంగా ప్రవర్తించారు. మాయమాటలతో నమ్మించి.. పక్కా ప్లాన్‌ ప్రకారం గదిలో బంధించి మరీ అత్యాచారం చేశారు. ప్రధాన నిందితుడు ప్రీత్‌ షెర్గిల్‌(39)ను పోలీసులు అరెస్టు చేయడంతో రెండున్నర నెలల క్రితం జరిగిన ఈ ఘోరం వెలుగులోకి వచ్చింది.
 
వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్‌లో పర్యటించేందుకుగాను కోల్‌కతాకు చెందిన, బీకాం చదువుతున్న యువతి(19) ఫిబ్రవరి 14న శంషాబాద్‌ విమానాశ్రయానికి వచ్చింది. తాను బసచేయబోయే హోటల్‌కు షేరింగ్‌ క్యాబ్‌లో బయల్దేరింది. టూర్‌కు వచ్చినట్లు తెలుసుకున్న తోటి ప్రయాణీకురాలు పింకీరాయ్ ఆమెతో మాట కలిపింది. తెలిసిన స్నేహితుడికి కారు ఉందని, అందులో ఇద్దరం నగర పర్యటనకు వెళ్దామంటూ నమ్మించింది. 
 
ఇలా ఫిబ్రవరి 15న ఇద్దరూ అమీర్‌పేటలోని హోటల్‌లో కలుసుకున్నారు. ఆపై హోటల్‌కు తీసుకెళ్లి  స్నేహితుడికి పరిచయం చేసింది. ఆ యువకుడు పక్కా ప్లాన్ ప్రకారం అపార్ట్‌మెంట్‌కు తీసుకెళ్లి శీతలపానీయంలో మత్తుమందు కలిపి ఇచ్చాడు. 
 
మత్తు మందులోనే యువతి ఇంట్లోంచి బయటకు వెళ్లే ప్రయత్నం చేయగా.. బెదిరించి మరీ అత్యాచారం చేశాడు. ఆపై మరో ముగ్గురు కోల్‌కతా యువతిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు జరుపుతున్నారు. ఈ పింకీరాయ్ కొరియోగ్రాఫర్ అని తేలింది.