బుధవారం, 25 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : గురువారం, 22 జులై 2021 (12:00 IST)

కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌ను చంపేసిన గూగుల్

ప్రముఖ సినీ కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్‌ను గుగూల్ చంపేసింది. 1963లో చెన్నైలో జన్మించిన శేఖర్ మాస్టర్ 2003 జూలై 8వ తేదీన చెన్నై కోడంబాక్కంలో చనిపోయినట్టు పేర్కొది. దీన్ని చూసిన శేఖర్ మాస్టర్ అభిమానులు గూగుల్‌పై తీవ్రంగా మండిపడుతున్నారు. 
 
గూగుల్ సెర్చింజన్‌లో శేఖర్ మాస్టర్ అని టైప్ చేయగానే వెంటనే శేఖర్ మాస్టర్ ఫోటోతో పాటు అతని పుట్టిన తేదీ, అతను మరణించిన తేదీని చూపించడంతో శేఖర్ మాస్టర్ అభిమానులు ఒక్కసారిగా విస్తుపోతున్నారు. 
 
అయితే గూగుల్ ఇలా చూపించడానికి కూడా ఒక కారణం ఉంది. తమిళం, మలయాళం సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా శేఖర్ నటించారు. అందరూ ఇతనిని మాస్టర్ శేఖర్‌గా పిలుచుకునేవారు. 
 
మాస్టర్ శేఖర్ తెలుగులో ‘అక్కా తమ్ముడు’ సినిమాలో తమిళనాడు దివంగత మాజీ సీఎం జయలలితకు తమ్ముడు పాత్రలో నటించి మెప్పించాడు. చైల్డ్ ఆర్టిస్టెగా ఎంటరైన మాస్టర్ శేఖర్ దాదాపు 50 సినిమాలకుపైగా నటించారు. 
 
ఈ క్రమంలోనే మాస్టర్ శేఖర్ జులై 8, 2003లో మరణించారు. దీంతో గూగుల్ సెర్చ్‌లో శేఖర్ మాస్టర్ అని సెర్చ్ చేయగానే కొరియోగ్రాఫర్ శేఖర్ మాస్టర్ ఫోటో రావడంతో పాటు అతడు మరణించిన తేదీని కూడా చూపించడంతో అభిమానులు తీవ్ర అసహనం వ్యక్తంచేస్తున్నారు.