శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 13 నవంబరు 2018 (11:14 IST)

కాజల్‌ను హత్తుకుని ముద్దు పెట్టిన ఛోటా కె.నాయుడు (Video)

సినీ ఇండస్ట్రీలో 'మీటూ' ఉద్యమం జోరుగా సాగుతోంది. అయితే తమకు నచ్చిన మెచ్చిన అమ్మాయిలతో మాత్రం సినీ ఇండస్ట్రీ ప్రముఖులు ఇవేమీ పట్టించుకోవడం లేదు. తాజాగా కవచం టీజర్ కార్యక్రమ వేదికగా ఓ సంఘటన జరిగింది. ఈ చిత్ర హీరోయిన్ కాజల్‌ను ప్రముఖ కెమెరామెన్ ఛోటా కె.నాయుడు గట్టిగా హత్తుకుని ఆమె బుగ్గపై ముద్దుపెట్టాడు. అంతే.. అక్కడున్నవారంతా ఒక్కసారిగా అవాక్కయ్యారు. 
 
బెల్లంకొండ సాయి శ్రీనివాస్ హీరోగా నిర్మించిన చిత్రం కవచం. ఇందులో కాజల్ అగర్వాల్ హీరోయిన్. ఛోటా కె. నాయుడు ఛాయాగ్రాహకుడు. టీజర్‌ విడుదల కార్యక్రమంలో చిత్రబృందంలో ఒక్కొక్కరి గురించి కాజల్‌ మాట్లాడుతూ... ఛోటా కె. నాయుడు గురించీ మాట్లాడారు.
 
ఆయన్ను 'స్మాల్' అని సంభోదించారు. 'ఛోటా... నాకిష్టమైన వ్యక్తి. మరోసారి ఆయనతో పని చేయడం అద్భుతమైన అనుభూతి' అన్నారామె. దీంతో కాజల్‌ దగ్గరకు వచ్చిన ఛోటా కె. నాయుడు ఆమెను గట్టిగా ముద్దెట్టుకుని బుగ్గపై ముద్దుపెట్టాడు. 
 
కొన్ని క్షణాలపాటు నివ్వెరపోయిన కాజల్.. కొద్దిసేపటికి తేరుకుని ఛోటాను ఉద్దేశిస్తూ 'ఛాన్స్‌ పే డ్యాన్స్' అని కాజల్‌ నవ్వేశారు. తర్వాత 'స్మాల్‌... ఇట్స్‌ ఫైన్‌. ఆయన నా కుటుంబంలోని వ్యక్తి కింద లెక్క' అంటూ ముగింపు పలికారు. చూడండి ఆ వీడియోను...