గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శుక్రవారం, 16 సెప్టెంబరు 2022 (08:23 IST)

టాలీవుడ్ సినీ కార్మికులకు వేతనాలు పెంపు.. జూలై నుంచి అమలు

tollywood film industry
తెలుగు చిత్రపరిశ్రమకు చెందిన సినీ నిర్మాణ కార్మికులకు వేతనాలు పెంచారు. ఈ పెంపు దాదాపు 30 శాతంగా ఉంది. ఈ పెంచిన వేతనాలు కూడా ఈ యేడాది జూలై నుంచే అందజేయనున్నారు. ఈ మేరకు ఫిల్మ్ చాంబర్, ఫిల్మ్ ఫెడరేషన్, నిర్మాతల మండలిలు సంయుక్తంగా ఓ ప్రకటన చేశాయి. 
 
వేతనాల పెంపునకు సంబంధించి బుధవారం కీలక చర్చలు జరిగాయి. అయితే, ఎంత మేరకు పెంపు, ఎప్పటి నుంచి అమలు వంటి కీలక అంశాలపై గురువారం కీలక నిర్ణయం వెలువడింది. ఈ మేరకు చిత్ర పరిశ్రమ నుంచి సంయుక్త ప్రకటన వెలువడింది. 
 
ఈ ప్రకటన మేరకు పెద్ద చిత్రాలకు పనిచేసే కార్మికులకు 30 శాతం మేరకు వేతనాలు పెంచనున్నారు. అదేసమయంలో చిన్న చిత్రాలకు పని చేసే కార్మికులకు మాత్రం 15 శాతం మేరకు వేతనాలు పెంచనున్నారు. అయితే, ఇది చిన్న చిత్రం, ఏది పెద్ద సినిమా అనే విషయాన్ని మాత్రం చలనచిత్ర వాణిజ్య మండలి, ఎంప్లాయీస్ ఫెడరేషన్‌లతో కూడిన ఒక కమిటి నిర్ణయిస్తుంది. 
 
ఇకపోతే, పెంచిన వేతనాలను కూడా ఈ యేడాది జూలై నుంచే అమలులు చేయనున్నట్టు ప్రకటించారు. ఫలితంగా కార్మికులకు అరియర్స్ కూడా అందనున్నాయి. ఈ కొత్త వేతన ఒప్పందం వచ్చే 2025 వరకు అమల్లోకి రానుంది.