శుక్రవారం, 26 ఏప్రియల్ 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By DV
Last Updated : శనివారం, 12 మార్చి 2016 (19:18 IST)

పూర్ణోదయా వారి ఆణిముత్యం... స్వాతిముత్యం సినిమాకు 30 ఏళ్ళు(Video)

మార్చి 13, 1986న స్వాతిముత్యం విడుదల అంటే నేటికి 30 ఏళ్ళన్న మాట. ఇప్పటివరకు తెలుగు చలనచిత్ర చరిత్రలో ప్రతిష్టాకరమైన ఆస్కార్ అవార్డుకి ఉత్తమ విదేశీ చిత్ర విభాగంలో ఒక తెలుగు చిత్రం ఉండటం స్వాతిముత్యంకే దక్కింది.
 
పూర్ణోదయా మూవీ క్రియేషన్స్ బ్యానర్ పైన అభిరుచి గల నిర్మాత ఏడిద నాగేశ్వరరావు, కళా తపస్వి కె.విశ్వనాథ్, కమల్ హాసన్ కాంబినేషన్‌లో వచ్చిన ఈ ముత్యం 1986 బాక్సాఫీస్ రికార్డు సృష్టించింది.
 
జాతీయ అవార్డుల్లో ఉతమ తెలుగు చిత్రం, నంది అవార్డులో బంగారు నంది, ఉత్తమ నటుడు, ఉత్తమ దర్శకుడు అవార్డులు, ఫిలిమ్‌ఫేర్ అవార్డులు తదితర అవార్డులను గెలుచుకుంది. రష్యన్ భాషలో డబ్ చేయబడి అక్కడ కూడా ఘన విజయం సాధించింది. తమిళంలో సిప్పిక్కుల్ ముత్తుగా విజయ ఢంకా మ్రోగించింది. తెలుగులో 25 కేంద్రాల్లో, కర్ణాటకలో 500 రోజులకి పైగా ఆడింది.
 
నటీనటులు: కమలహాసన్, రాధిక, శరత్ బాబు, గొల్లపూడి, సుత్తి వీరభద్ర రావు, మల్లికార్జున రావు, ఏడిద శ్రీరామ్, దీప, వై . విజయ, మాస్టర్ కార్తీక్, సాంకేతిక వర్గం: మాటలు : సాయినాథ్ & ఆకెళ్ళ, పాటలు : డా. సి. నారాయణ రెడ్డి , ఆత్రేయ & సీతారామ శాస్త్రి, ఫోటోగ్రఫీ : మవ్. రఘు, గానం : ఎస్పీబి, ఎస్.జానకి , పి. సుశీల, ఎస్పీ శైలజ, సంగీతం : ఇళయరాజా, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: ఏడిద రాజా, నిర్మాత : ఏడిద నాగేశ్వరరావు, కథ , స్క్రీన్ ప్లే- దర్శకత్వం: కె.విశ్వనాధ్.