గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 7 అక్టోబరు 2023 (20:58 IST)

కలర్స్‌ స్వాతిని ఫుట్‌బాల్‌ ఆడుకుంది ఎవరో తెలుసా!

Colors Swathini
Colors Swathini
కలర్స్‌ స్వాతి తనను ఫుట్‌ బాల్‌ ఎందుకు ఆడుకుంటారని సెటైరిక్‌గా కాస్త బాధగా తన భావాన్ని వ్యక్తీకరించింది. మంత్‌ ఆఫ్‌ మదు సినిమాలో నటించింది. నవీన్‌ చంద్ర హీరో. ఇద్దరూ భార్యభర్తలు. పెండ్లికి ముందే ఒకటవుతారు. పెండ్లయ్యాక విడాకులకు అప్లయి చేస్తుంది. ఈ పాయింట్‌తో వచ్చిన ఈ సినిమాలో ఆమె నటన గురించి, ఇతరత్రా విషయాల గురించి కొన్ని వెబ్‌సైట్లు చాలా నీచంగా రాశాయని వాపోయింది.
 
కొందరు జర్నలిస్టులకయితే అసలు రివ్యూలు రాయడం కూడా చేతకాదు. అలాంటివారు కొన్ని పదాలు చాలా ఘోరంగా వున్నాయి. అసలు వారు సినిమా చూడకుండా రాశారు అంటూ దర్శకుడు యశ్వంత్‌ కూడా వాపోయారు. స్వాతి అయితే ఏకంగా.. నన్ను ఎందుకు మీరు ఫుట్‌బాల్‌ ఆడుకుంటారంటూ కాలితో ఫుట్‌బాల్‌ను కొడుతున్నట్లు చూపిస్తూ సింబాలిక్‌గా తెలియజేసింది. నేను తెలుగు అమ్మయి నే కదా. ఎందుకు ఎలా రాస్తారని బాధపడింది.