ఆదివారం, 5 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఐవీఆర్
Last Modified: శనివారం, 5 ఫిబ్రవరి 2022 (10:47 IST)

2022తో వెండితెరకు గుడ్ బై, ఇక సినిమాల్లో నటించనంటున్న కమెడియన్ రాహుల్

హాస్య నటుడు రాహుల్ రామకృష్ణ అకస్మాత్తుగా ప్రకటించిన నిర్ణయంతో అతడి అభిమానులు షాక్ తిన్నారు. ఇప్పుడిప్పుడే హాస్య నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న రాహుల్ వున్నట్లుండి ఇకపై సినిమాల్లో నటించనంటూ ట్వీట్ చేసాడు. 2022లో తను చేయాల్సిన చిత్రాలు చేసేసి సినిమాల్లో నటించనను తేల్చి చెప్పేసాడు.

 
తన ప్రకటన తర్వాత ఎవరెలా ఫీలయినా తన నిర్ణయం మాత్రం ఇదేనంటూ చెప్పుకొచ్చాడు. జాతిరత్నాలు, గీత గోవిందం తదితర చిత్రాలతో మెప్పించిన రాహుల్ అకస్మాత్తుగా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నాడన్నది చర్చనీయాంశంగా మారింది. కొందరైతే ఇదేదో జోక్ అయ్యుంటుందిలే అంటున్నారు.