Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

మాపై అలాంటి పుకార్లొస్తే నవ్వుకునేవాళ్లం: హెబ్బా పటేల్, రాజ్ తరుణ్

శుక్రవారం, 2 జూన్ 2017 (15:42 IST)

Widgets Magazine

రాజ్‌తరుణ్‌తో మూడోసారి జతకట్టిన హెబ్బా పటేల్.. పుకార్లపై స్పందించింది. వీరిద్దరి కాంబోలో రూపుదిద్దుకుని శుక్రవారం విడుదల అంధగాడు సినిమాకు పాజిటివ్ టాక్ వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా హెబ్బా, తరుణ్ మాట్లాడుతూ.. తామిద్దరం మంచి స్నేహితులమని చెప్పారు. తమ స్నేహం గురించి మీడియాలో వచ్చే వార్తలు చూసినవ్వుకుంటామని చెప్పింది. తాము కలిసి నటించిన సినిమాలు అభిమానులను అలరించడంతో ఏవేవో పుకార్లు పుట్టించారని హెబ్బా పటేల్ వివరణ ఇచ్చింది.
 
తామిద్దరి కాంబోలో హిట్స్ వచ్చాయని, తమ రిలేషన్ కూడా షూటింగ్ వరకేనని హెబ్బా తెలిపింది. సహనటులు ఎవరైనా సరే పాత్ర పోషణ కోసం వారితో సౌకర్యంగా ఉంటామని చెప్పింది. అంత మాత్రానికే లేనిపోని పుకార్లు పుట్టిస్తారని హెబ్బా పటేల్ వాపోయింది. రాజ్ తరుణ్ కూడా హెబ్బా పటేల్‌తో తనకు ప్రేమాయణం ఉందని వస్తున్న వార్తలను కొట్టిపారేశాడు. వెండితెరపై కెమిస్ట్రీ వర్కౌట్ కావడంతో ప్రేక్షకులను ఆకట్టుకున్నామే కానీ.. తమ మధ్య వేరొక సంబంధం లేదన్నాడు. 
 
ఇదిలా ఉంటే.. 'అంధగాడు' సినిమాపై వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రశంసలు కురిపించాడు. రాజ్ తరుణ్ నటన అంధగాడులో ఆకట్టుకుందని చెప్పాడు. సినిమా మొత్తం రకరకాల మలుపులు తిరుగుతూ, ఆసక్తికరంగా కొనసాగుతుందని తెలిపాడు. సినిమా చాలా బాగుందని... చిత్రానికి సంబంధించిన టీమ్ మొత్తానికి అభినందనలు తెలియజేస్తున్నానన్నాడు. రాజ్ తరుణ్ నటన ఇతర సినిమాల కంటే అంధగాడులో విభిన్నంగా ఆకట్టుకునే రీతిలో ఉందని కితాబిచ్చాడు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

జూ.ఎన్టీఆర్ గడ్డం... మహేష్ బాబు లుంగీ... ఇదే చెర్రీ-సుక్కు చిత్రమా?

సుకుమార్ - రామ్‌చరణ్ కాంబినేషన్‌లో సినిమా వస్తున్నట్టు అందరికీ తెలిసిన విషయమే. కానీ ఈ ...

news

టీవీరంగంలోకి రాకముందే అతనితో లవ్‌లో ఉన్నా.. నటించడం చాలా కష్టం బాబోయ్: లాస్య

యాంకర్ నుంచి యాక్టర్లుగా మారడం ప్రస్తుతం ఫ్యాషనైపోయింది. ఇప్పటికే అనసూయ, రష్మీ వంటి అందాల ...

news

కన్నబిడ్డనే కిరాతకంగా చంపేసిన తండ్రికి జీవిత ఖైదు.. తనకు పుట్టలేదని?

కన్నబిడ్డ మూగ, చెవిటితో పుట్టడంతో ఆ బిడ్డ తనకు పుట్టలేదని ఓ తండ్రి కిరాతకంగా చంపేశాడు. ఈ ...

news

కామెడీ హీరోలు వాటి కోసం ఎగబడుతున్నారు... దర్శకులు అందుకే తప్పిస్తున్నారా...?

గత కొన్నేళ్లగా సినిమాలల్లో కమెడియన్లకు పాత్రలు తగ్గుతూ వస్తున్నాయి. ప్రముఖంగా తెలుగు, ...

Widgets Magazine