Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

''మహానటి'' శ్రీదేవికి అంకితం.. కాంగ్రెస్ ట్వీట్.. చీవాట్లు తప్పలేదు.. ఎందుకని?

ఆదివారం, 25 ఫిబ్రవరి 2018 (17:44 IST)

Widgets Magazine

బాల‌న‌టిగా ప‌రిచ‌య‌మై ఆల్ ఇండియా సూప‌ర్ స్టార్‌గా ఎదిగిన సినీ లెజండ్ శ్రీదేవి.. గుండెపోటుతో అకాల మరణం చెందారు. శ్రీ‌దేవితో ఆఖ‌రి పోరాటం, జ‌గ‌దేక వీరుడు - అతిలోక సుంద‌రి, గోవిందా గోవింద వంటి చిత్రాల‌ను నిర్మించిన ప్ర‌ముఖ నిర్మాత‌ సి.అశ్వ‌నీద‌త్‌.. న‌టీమ‌ణి సావిత్రిపై తెర‌కెక్కిస్తున్న తన తాజా చిత్రం ''మ‌హాన‌టి''ని శ్రీ‌దేవికి అంకితం చేస్తున్నట్లు ప్ర‌క‌టించారు. సినీ, రాజకీయ ప్రముఖులు సోషల్‌ మీడియా వేదికగా శ్రీదేవి కుటుంబానికి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియజేస్తున్నారు. 
 
ఈ నేపథ్యంలో నటి శ్రీదేవి మృతిపై స్పందించిన నేషనల్ కాంగ్రెస్‌ పార్టీ పొలిటికల్ ట్విస్ట్‌తో తమ అధికారిక ట్విట్టర్ ఖాతాలో ఓ ట్వీట్‌ చేసి నాలుక కర్చుకుంది. కాంగ్రెస్ ట్వీట్ చేసిన కొద్దిక్షణాల్లోనే ఆ ట్వీట్‌కు నెటిజన్ల నుంచి తీవ్ర స్థాయిలో విమర్శలు వెల్లువెత్తాయి. దాంతో వెంటనే కాంగ్రెస్ ఆ ట్వీట్‌ను తొలగించింది.
 
2013లో యూపీఎ హయాంలోనే శ్రీదేవి పద్మశ్రీ అవార్డును అందుకున్నారని తన ట్వీట్‌లో చెప్పడంతో.. శ్రీదేవికి ఇచ్చిన అవార్డుల్లో రాజకీయాలు అవసరమా.. ఆమె లోకం విడిచి వెళ్లినా రాజకీయాల్లేంటని నెటిజన్లు ఫైర్ కావడంతో కాంగ్రెస్ ఆ ట్వీట్‌ను తొలగించింది. Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

శ్రీదేవి మృతి పట్ల సచిన్ షాక్.. అతిలోక సుందరి చివరి సినిమా అదే..?

టీమిండియా దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్.. సినీ దిగ్గజం శ్రీదేవి మృతిపట్ల సంతాపం ...

news

#Sridevi చివరి స్టెప్పులు.. వీడియో

అందాల తార, అతిలోక సుందరి శ్రీదేవి తిరిగి రాని లోకాలకు వెళ్లిపోయారు. దిగ్గజ నటీమణి చివరి ...

news

#RIPSridevi : వెండితెర దేవకన్య... మళ్లీ ఎప్పుడు పుడతావ్..

కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ప్రతి ఒక్కరి మనస్సుల్లో తన నటనతో చిరస్థాయిగా నిలిచిన నటి ...

news

శ్రీదేవి మరణం... రేపు ముంబైలో అంత్యక్రియలు!

లెజండరీ నటి, అతిలోకసుందరి శ్రీదేవి ఇక లేరు. బాలీవుడ్ నటుడు మొహిత్ మార్వా వివాహం నిమిత్తం ...

Widgets Magazine