Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

వంగవీటి సినిమాపై వెనక్కి తగ్గిన వర్మ: కమ్మ కాపు.. పాటను తొలగించినట్లు ట్వీట్.. పిటిషన్ కొట్టివేత

శుక్రవారం, 2 డిశెంబరు 2016 (15:22 IST)

Widgets Magazine
vangaveeti

వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ వెనక్కి తగ్గాడు. విజయవాడ రౌడీయిజం, రాజకీయాల నేపథ్యంలో రాంగోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న సినిమా వంగవీటి. యధార్థ ఘటనల ఆధారంగా రూపుదిద్దుకుంటున్న ఈ సినిమాలో వివాదాస్పద అంశాలను వర్మ ప్రస్తావించారు. అంతేకాదు సినిమా మొదలైన సమయంలోనే కమ్మ కాపు అంటూ రిలీజ్ చేసిన సాంగ్ వివాదాస్పదమైంది.
 
ఈ నేపథ్యంలో విజయవాడ చరిత్రను వక్రీకరించారంటూ కొంత మంది కోర్టును ఆశ్రయించారు. విజయవాడలో ముఖ్యంగా కుల విద్వేశాలను రెచ్చగొట్టేవిధంగా ఉన్న కమ్మ కాపు పాటను సినిమాను నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విచారించిన హైకోర్టు చిత్ర దర్శకుడు రాం గోపాల్ వర్మతో పాటు, నిర్మాత దాసరి కిరణ్ కుమార్‌లకు నోటీసులు జారీ చేసింది. అంతేకాకుండా కోర్టు తీర్పు వెలువడే వరకు ఈ సినిమాకు సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వొద్దని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
 
దీంతో ఇప్పటికే నోట్ల రద్దుతో కష్టాలు తప్పవని భావించిన వర్మ అండ్ టీమ్ డిసెంబర్ 23న ఈ సినిమాను విడుదల చేయాలని భావిస్తోంది. అందుకే వర్మ ఈ పాట విషయంలో వెనక్కి తగ్గింది. వివాదానికి కారణమైన పాటను సినిమా నుంచి తొలగిస్తున్నట్టుగా ప్రకటించింది. 'వంగవీటి' చిత్రంలోని 'కమ్మ కాపు..' అనే పాటను తీసేసినట్లు దర్శకుడు రామ్‌గోపాల్‌ వర్మ ట్విట్టర్ ద్వారా  స్పష్టం చేశారు. కొందరి సెంటిమెంట్స్‌ను గౌరవిస్తూ ఈ పాటను తీసేస్తున్నట్లు వర్మ తాజాగా ట్వీట్‌ చేశారు. భావోద్వేగాలతో కూడిన చిత్రమని, ఎవర్నీ అప్రతిష్ఠపాలు చేయదని వివరణ ఇచ్చుకున్నాడు. దీంతో అనుకున్నట్టుగా రాంగోపాల్ వర్మ వంగవీటి డిసెంబర్ 23న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ శనివారం ఈ చిత్ర ఆడియోను విజయవాడలోనే వర్మ విడుదల చేయనున్నారు.
 
మరోవైపు విజయవాడలో జరిగిన ఫ్యాక్షన్‌ రాజకీయాల బ్యాక్ డ్రాప్ లో 'వంగవీటి' సినిమా వాస్తవానికి విరుద్ధంగా ఉందని వంగవీటి మోహనరంగా కొడుకు రాధాకృష్ణ హైకోర్టులో వ్యాజ్యం దాఖలు చేసిన సంగతి తెలిసిందే. ఈ సాంగ్‌ను తొలగిస్తామని దర్శకుడు కోర్టుకు హామీ ఇవ్వడంతో ఈ పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసింది.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  

Loading comments ...

తెలుగు సినిమా

news

మోక్షజ్ఞ సినీ ఆరంగేట్రం ఖాయం... దర్శకుడు క్రిషే.. రాజమౌళి, త్రివిక్రమ్ నో చెప్పారట..

నందమూరి హీరో, బాలకృష్ణ వందో సినిమా గౌతమీపుత్ర శాతకర్ణి సినిమా షూటింగ్ పూర్తయిన ...

news

చెర్రీకి హీరోయిన్ దొరకట్లేదట.. బాబాయ్ హీరోయిన్‌నే ఖరారు చేస్తాడా? చెర్రీ సరసన కీర్తీ?

ధృవ సినిమా త్వరలో రిలీజ్ కానున్న నేపథ్యంలో తదుపరి సినిమాపై రామ్ చరణ్ దృష్టి పెట్టాడు. ...

news

గౌతమీపుత్ర శాతకర్ణి షూటింగ్ ఓవర్.. ఫోటోల రిలీజ్.. నయనలా కంటతడిపెట్టిన శ్రియ? (Photos)

బాహుబలితో సరితూగేలా ‘గౌతమీపుత్ర శాతకర్ణి’ని తెరకెక్కించడానికి దర్శకుడు క్రిష్ శాయశక్తులా ...

news

నయనతారకు బ్లాక్ మనీ కష్టాలా.. ఒక సినిమాకు రూ.3కోట్లు.. వైట్ చేస్తేనే ఛాన్స్.. నిర్మాతలు షాక్..?

అందాల ముద్దుగుమ్మ నయనతార ప్రస్తుతం దక్షిణాది హీరోయిన్‌లలో అగ్రస్థానంలో నిలిచింది. స్టార్ ...

Widgets Magazine