శుక్రవారం, 24 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By శ్రీ
Last Modified: బుధవారం, 8 మే 2019 (15:39 IST)

వెంకటేష్-నారా రోహిత్ కలిసి నటిస్తున్నారా? మీకెవరు చెప్పారు?

మాధవన్, విజయ్‌ సేతుపతి హీరోలుగా తెరకెక్కిన చిత్రం విక్ర‌మ్ వేదా. ఈ సినిమా అన్నివ‌ర్గాల ప్రేక్ష‌కుల‌ను ఆక‌ట్టుకుని బ్లాక్‌బస్టర్ అయ్యింది. ఈ సినిమా తెలుగులో రీమేక్‌ కాబోతోందని కొంత కాలంగా వార్తలు వస్తున్నాయి. ఒక‌రిద్ద‌రి పేర్లు ప్ర‌చారంలోకి వ‌చ్చాయి. అయితే.. తాజాగా విక్ట‌రీ వెంక‌టేష్ - నారా రోహిత్ కాంబినేష‌న్లో ఈ సినిమా తెలుగులో రీమేక్ చేయ‌నున్నారనీ, ఈ చిత్రానికి వీవీ వినాయక్‌ దర్శకుడనీ వార్తలు వచ్చాయి. 
 
విజయ్‌ సేతుపతి రోల్‌లో వెంకటేష్, మాధవన్‌ చేసిన పాత్రను నారా రోహిత్ చేయ‌నున్నారు అని వార్త‌లు వ‌చ్చాయి. అయితే... ఈ వార్త‌లపై సురేష్ బాబు స్పందిస్తూ.. వెంక‌టేష్ విక్ర‌మ్ వేదా రీమేక్‌లో న‌టించ‌నున్నాడు అంటూ మీడియాలో వ‌చ్చిన వార్త‌ల్లో వాస్త‌వం లేదు. ప్ర‌స్తుతం వెంక‌టేష్ వెంకీ మామ షూటింగ్‌లో బిజీగా ఉన్నాడు. నెక్ట్స్ మూవీ ఏంటి అనేది త్వ‌ర‌లోనే ఎనౌన్స్ చేస్తామ‌న్నారు.