మంగళవారం, 24 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ప్రీతి
Last Updated : గురువారం, 25 ఏప్రియల్ 2019 (14:25 IST)

బరువు తగ్గిన రానా... కారణమేంటి.. న్యూలుక్ అదుర్స్....

"లీడర్" సినిమాతో సినీరంగ ప్రవేశం చేసిన రానా దక్షణాది, ఉత్తరాది అనే తేడా లేకుండా సినిమాలు చేసేస్తున్నాడు. పైగా, హీరో పాత్రలకే పరిమితం కాకుండా విలన్, క్యారెక్టర్ రోల్స్ అన్నీ చేస్తూ తన సత్తా చాటుకున్నాడు. మంచి కథాబలం ఉన్న సినిమాలను ఎంపిక చేసుకుని మరీ నటిస్తూ కెరీర్ స్టార్టింగ్ నుండి ఎన్నో మంచి పాత్రలలో జీవించాడు. ఇక "బాహుబలి" సినిమాతో రానాకు ఉన్న క్రేజ్ అమాంతం పెరిగిపోయింది. అయితే ఆ సినిమా తర్వాత పెద్దగా సినిమాలు ఏవీ చేయలేదు.
 
ఇందుకు కాకరణం రానా ఆరోగ్య సమస్యలతో బాధపడుతుండటం అని అప్పట్లో పలు వార్తలు వినిపించాయి. దీనికితోడు రానా తండ్రి సురేష్‌ బాబు కూడా రానా స్వల్ప ఆరోగ్య సమస్యతో ఇబ్బంది పడుతున్నట్లు వెల్లడించారు. తాజాగా రానా హైదరాబాద్‌ ఎయిర్‌పోర్ట్‌లో నుండి వస్తూ మీడియా కం‍టపడ్డాడు. అస్సలు గుర్తుపట్టలేనంత సన్నగా మారిపోయిన రానా లుక్‌ మరోసారి చర్చనీయాంశమైంది.
 
బాగా సన్నబడిన రానాను చూసి అభిమానులు సైతం షాక్‌ అవుతున్నారు. ఇప్పుడు రానా చేస్తున్న సినిమాలు హాథీ మేరే సాథీ, విరాటపర్వం కోసం ఏమైనా ఇలా బరువు తగ్గాడా? లేక ఏదైనా ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారా? అని చర్చలు జోరుగా సాగుతున్నాయి.