శుక్రవారం, 10 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By వరుణ్
Last Updated : గురువారం, 5 అక్టోబరు 2023 (12:53 IST)

సల్మాన్ సినిమా ఫ్లాప్ కావడంతో చనిపొమ్మంటూ ట్రోల్స్ చేశారు : డైసీ షా

daisy shah
బాలీవుడ్ హీరోయిన్ డైసీ షా సంచలన విషయాలను బహిర్గతం చేశారు. గత 2014లో బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్‌తో చేసిన 'జయహో' చిత్రం ఆశించిన స్థాయిలో ప్రేక్షకాదారణ పొందలేక పోయింది. ఈ చిత్ర ఫ్లాప్‌కు హీరోయిన్ డైసీ షానే కారణమంటూ ప్రేక్షకులు విమర్శలు మొదలుపెట్టారు. నెటిజన్స్‌ ఇష్టానుసారంగా ట్రోల్స్ చేశారు. వీటిపై డైసీ షా తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన మనస్సులోని మాటను బహిర్గతం చేశారు. 
 
'ఏక్ థా టైగర్' సినిమా తర్వాత సల్మాన్ ఖాన్ నటించిన చిత్రం 'జయహో'. ఈ చిత్రం ప్రేక్షకులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే, ఆ చిత్రం ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. దీనికి తానే కారణమంటూ విమర్శలు చేశారు. అన్ని రకాలుగా ట్రోల్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది. మరికొందరు మితిమీరిన కామెంట్స్ చేశారు. నువ్వు ఇంకా ఎందుకు బతికోవున్నావు.. చచ్చిపోవచ్చు కదా దీనికి మించి ఇంకేం చేయాలనుకుంటున్నావు అని తీవ్రంగా దూషించారు. 
 
తన వరకు 'జయహో' చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. రూ.60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా, రూ.138 కోట్ల కలెక్షన్స్ రాబట్టింది. ఇంతకంటే ఇంకేం కావాలి. ఇవన్నీ తెలియని అమాయక ప్రేక్షకులు తనను ఆడిపోసుకున్నారు' అంటూ చెప్పుకొచ్చారు. కాగా, ఈ బాలీవుడ్ నటి కన్నడ, తమిళ చిత్రాల్లో కూడా అతిథి పాత్రల్లో నటించారు.