మంగళవారం, 12 ఆగస్టు 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శనివారం, 13 జులై 2024 (10:12 IST)

దళపతి విజయ్ The GOAT నుంచి డ్యాన్స్ అంథమ్- విజిలేస్కో సాంగ్ రిలీజ్

The GOAT  Dance Anthem
The GOAT Dance Anthem
దళపతి విజయ్, వెంకట్ ప్రభుల మోస్ట్ ఎవైటెడ్ పాన్ ఇండియా మూవీ The GOAT (ది గ్రేటెస్ట్ ఆఫ్ ఆల్ టైమ్) ఫస్ట్ సింగిల్ రిలీజ్ అయ్యింది. యువన్ శంకర్ రాజా కంపోజ్ చేసిన ఈ పాటకు యువన్ శంకర్ రాజా, నకాష్ అజీజ్ వారి ఎనర్జిటిక్ వోకల్స్ తో ఎక్ష్త్రా ఎనర్జీని యాడ్ చేశారు. రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి.
 
ఈ సాంగ్ పవర్ ఫుల్ ఎనర్జీతో డ్యాన్స్ అంథమ్. ట్రాక్ స్పార్క్లింగ్ ఎట్మాస్పియర్ ని క్రియేట్ చేసి లిజనర్స్ కి ఫుట్ ట్యాపింగ్ నెంబర్ గా అలరించింది. ఛాంపియన్షిప్ ని సెలబ్రేట్ చేసుకునే సాంగ్ ఇది, సినిమా సెంట్రల్ థీమ్ ని రిజనేట్ చేస్తోంది. లిరికల్ వీడియోలో ప్రభుదేవా, ప్రశాంత్,అజ్మల్ అమీర్‌లతో కలిసి విజయ్ డ్యాన్స్ అదరగొట్టారు. రాజు సుందరం మాస్టర్ కొరియోగ్రఫీ చేశారు. కంప్లీట్ విజువల్స్‌తో పాటను చూసినప్పుడు మరింత ఇంపాక్ట్ గా ఉండబోతోంది.
 
విజయ్ ద్విపాత్రాభినయం చేస్తున్న ఈ చిత్రంలో ప్రశాంత్, ప్రభుదేవా, మోహన్, జయరామ్, స్నేహ, లైలా, అజ్మల్ అమీర్, మీనాక్షి చౌదరి, వైభవ్, యోగి బాబు, ప్రేమి అమరెన్, యుగేంద్రన్ వాసుదేవన్, అఖిలన్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.
 
ఎజిఎస్ ఎంటర్‌టైన్‌మెంట్ ప్రై లిమిటెడ్‌పై కల్పాతి ఎస్ అఘోరమ్, కల్పాతి ఎస్ గణేష్, కల్పాతి ఎస్ సురేష్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి సిద్ధార్థ నుని సినిమాటోగ్రఫీ అందించారు.
 
పాన్ ఇండియా ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఈ పాన్ ఇండియా మూవీ తెలుగు వెర్షన్‌ను గ్రాండ్ గా విడుదల చేయనుంది.