Widgets Magazine

రంగమ్మ మంగమ్మ పాటకు బుడతడి స్టెప్పులు.. కిడ్నాప్ చేస్తానని?

''రంగస్థలం''సినిమా బంపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్, సమంత హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలోని రంగమ్మ మంగమ్మ పాట జనాదరణ పొందింది. ఈ పాటకు పేరడీలు సోషల్ మీడియాలో పేలుతున్నాయి.

selvi| Last Updated: శనివారం, 9 జూన్ 2018 (11:53 IST)
''రంగస్థలం''సినిమా బంపర్ హిట్ అయిన సంగతి  తెలిసిందే. ఈ సినిమాలో రామ్ చరణ్, హీరోహీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాలోని  పాట జనాదరణ పొందింది. ఈ పాటకు పేరడీలు సోషల్ మీడియాలో పేలుతున్నాయి. ఈ పాటపై ఎన్నో స్ఫూప్‌లు వచ్చాయి. నటుడు ఉత్తేజ్‌ కూతురు కూడా మెగా హీరో రామ్‌చరణ్‌ నటనను పొగుడుతూ రంగమ్మ మంగమ్మ పాటను పేరడీ చేశారు. 
 
తాజాగా ఓ చిన్నారి రంగమ్మ మంగమ్మ పాటకి అదిరిపోయే స్టెప్పులేశాడు. ఈ చిన్నారి వీడియోని ఓ నెటిజన్ తన ట్విట్టర్‌లో షేర్ చేస్తూ ఒక్కసారి చూస్తే మళ్ళీ చూడకుండా ఉండలేరు అంటూ సుకుమార్, సమంత, అనసూయలకి ట్యాగ్ చేశాడు.
 
సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉండే సమంత వెంటనే ఈ వీడియోని రీ ట్వీట్ చేస్తూ.. ఈ క్యూటీని తాను కిడ్నాప్ చేస్తానని సమంత కామెంట్ చేసింది. ప్రస్తుతం ఈ బుడతడి వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


దీనిపై మరింత చదవండి :