Widgets Magazine Widgets Magazine
Widgets Magazine

దాసరి నారాయణ రావు మా బంధువు.. వ్యక్తిగతంగా తీరని లోటు : పవన్ కళ్యాణ్

బుధవారం, 31 మే 2017 (10:47 IST)

Widgets Magazine
dasari - pawan - tsr

తెలుగు చిత్ర పరిశ్రమ ముద్దుబిడ్డ, దర్శకరత్న దాసరి నారాయణరావు తమకు బంధువు అవుతారని, ఆయన మృతి తనకు వ్యక్తిగతంకా తీరని లోటని హీరో, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. మంగళవారం కన్నుమూసిన దాసరి భౌతికకాయానికి పవన్ కల్యాణ్ నివాళులర్పించారు. దాసరి నివాసానికి వెళ్లిన ఆయన... దాసరి భౌతికకాయం వద్ద పూలమాల ఉంచి నమస్కరించారు. ఆయనతో పాటు దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్, కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు టి.సుబ్బరామిరెడ్డిలు కూడా వచ్చారు. 
 
అనంతరం ఆయన మాట్లాడుతూ... దాసరి మృతి తనను ఎంతో కలచి వేసిందన్నారు. ఆసుపత్రిలో ఆయన చికిత్స పొందుతున్నప్పుడు వెళ్లి కలిశానని... ఆయన త్వరగా కోలుకుంటారని ఆశించానని చెప్పారు. తన చిన్నతనం నుంచి దాసరి తనకు బాగా పరిచయమని... బంధువు కూడా అని తెలిపారు. దాసరి కుటుంబసభ్యులకు సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకుందామన్నారు. 
 
ఇకపోతే.... దాసరి నారాయణరావు మరణం తనను దిగ్భ్రాంతికి గురి చేసిందని సినీ నిర్మాత, రాజకీయవేత్త, వ్యాపారవేత్త అయిన టి.సుబ్బరామిరెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఆయన ఒక మహా దర్శకుడు, నిర్మాత, నటుడు అని కీర్తించారు. సినీ రంగంతో పాటు రాజకీయ రంగానికి కూడా పేరు తీసుకువచ్చిన గొప్ప మనిషి అని అన్నారు. దాసరిలాంటి మరో వ్యక్తిని భవిష్యత్తులో మనం చూడలేమని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నానని తెలిపారు.Widgets Magazine
Widgets Magazine
Widgets Magazine
దీనిపై మరింత చదవండి :  
Tsr Pawan Kalyan Personal Loss Dasari's Death

Loading comments ...

తెలుగు సినిమా

news

ఖైదీ కొత్త రికార్డ్: అమ్మడు లెట్స్‌ డూ కుమ్ముడు, రత్తాలు రత్తాలు పాటల్ని రెండేసి సార్లు?!

మెగాస్టార్ చిరంజీవి 150వ సినిమా క్రేజ్‌ ఏమాత్రం తగ్గలేదు. దాదాపు దశాబ్ధం తర్వాత చేసిన ...

news

పద్మతోనే శాశ్వత నిద్రలో దాసరి నారాయణ రావు... ఆమె జ్ఞాపకాలతోనే.. తిరిగిరాని లోకాలకు..

దాసరి సతీమణి మరణించడంతోనే దర్శకరత్న దాసరి నారాయణ రావు కుంగిపోయారు. పద్మ మరణించిన 2011, ...

news

ఇకపై మా కష్టాలు ఎవరికి చెప్పుకోవాలి?: భౌతికకాయం వద్ద బోరున విలపించిన సుద్దాల అశోక్ తేజ

ప్రముఖ దర్శకుడు దాసరి నారాయణరావు ఆకస్మిక మృతి పట్ల ప్రముఖ గీత రచయిత సుద్దాల అశోక్ తేజ ...

news

సినీ పరిశ్రమలో మరో విషాదం.. రాజ్‌కుమార్ సతీమణి కన్నుమూత

తెలుగు సినీ పరిశ్రమలో మరో విషాదం జరిగింది. కర్నాటక సినీ దిగ్గజం రాజ్‌కుమార్‌ సతీమణి ...

Widgets Magazine