గురువారం, 26 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : బుధవారం, 27 ఏప్రియల్ 2022 (12:23 IST)

కేన్స్ 75వ ఫెస్టివల్ జ్యూరీ కోసం దీపికా పదుకునే ఎంపిక

deepika
కేన్స్ 75వ ఫెస్టివల్ జ్యూరీ కోసం బాలీవుడ్ టాప్ హీరోయిన్ దీపికా పదుకునే ఎంపికైంది. 75వ కేన్స్ ఫిలిమ్ ఫెస్టివల్ కోసం ఎంపికైన ఏకైక భారతీయ నటిగా దీపికా నిలిచింది.  
 
అంతర్జాతీయ పోటీల ఎనిమిది మంది సభ్యుల జ్యూరీలో భాగంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా ఎంపికైంది. ఈ జ్యూరీలో ఫ్రెంచ్ నటుడు విన్సెంట్ లిండన్, ఇతర పేర్లు దీపికతో పాటు ఇరాన్ ఫిల్మ్ మేకర్ అస్ఘర్ ఫర్హాది, స్వీడిష్ నటి నూమి రాపేస్, నటి స్క్రీన్ రైటర్ నిర్మాత రెబెక్కా హాల్, ఇటాలియన్ నటి జాస్మిన్ ట్రింకా, ఫ్రెంచ్ దర్శకుడు లాడ్జ్ లై, అమెరికన్ దర్శకుడు జెఫ్ నికోలస్, నార్వేకు చెందిన దర్శకుడు జోచిమ్ ట్రియర్ ఉన్నారు.
 
ఇకపోతే.. తన కెరీర్‌లో, దీపికా పదుకొనే భారతీయ సినిమాల్లో కొన్ని ఉత్తమ ప్రదర్శనలను అందించింది. బాలీవుడ్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న దీపికా పదుకునే.. 30కి పైగా ఫీచర్ చిత్రాల్లో నటించింది. 
 
అలాగే హాలీవుడ్ నటుడు విన్ డీజిల్‌తో ఎక్స్ ఎక్స్ ఎక్స్: ది రిటర్న్‌లో కథానాయికగా నటించింది. తద్వారా హాలీవుడ్ రంగ ప్రవేశం చేసింది. పద్మావత్ వంటి సినిమాలకు గాను దీపిక అవార్డు గెలుచుకున్న సంగతి తెలిసిందే.