'దేవదాస్' జర్నీ సాగిందిలా... మేకింగ్ వీడియో

అక్కినేని నాగార్జున, నాని కాంబినేషన్‌లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం "దేవదాస్". ఈ చిత్రం గత నెలలో విడుదలై మంచి టాక్‌తో ప్రదర్శితమవుతోంది.

Devadass
Last Updated: శనివారం, 6 అక్టోబరు 2018 (09:52 IST)
అక్కినేని నాగార్జున, నాని కాంబినేషన్‌లో వచ్చిన మల్టీస్టారర్ చిత్రం "దేవదాస్". ఈ చిత్రం గత నెలలో విడుదలై మంచి టాక్‌తో ప్రదర్శితమవుతోంది. అయితే, ఈ చిత్రానికి సంబంధించిన మేకింగ్ వీడియోను చిత్ర యూనిట్ తాజాగా రిలీజ్ చేసింది. 'దేవదాస్' జర్నీ సాగిందిలా అనే పేరుతో విడుదల చేసిన ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
 
'మహానటి' విజయం తర్వాత వైజయంతి మూవీస్ పతాకంపై అశ్వినీదత్ దేవదాస్ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం విమ‌ర్శ‌కుల ప్ర‌శంస‌ల‌తో పాటు అభిమానుల ఆద‌ర‌ణ‌ని పొందింది. కొద్ది రోజులుగా చిత్రానికి సంబంధించిన వీడియోలు విడుద‌ల చేస్తూ సినిమాపై మ‌రింత ఆస‌క్తి పెంచుతున్నారు. తాజ‌గా 'దేవదాస్' ప్ర‌యాణం మొద‌టి నుండి చివ‌రి వ‌ర‌కు ఎలా సాగిందో వీడియోలో చూపించారు. ఆ వీడియోపై మీరు ఓ లుక్కేయండి.

 దీనిపై మరింత చదవండి :