బిగ్ బాస్ షోలో కాబోయే విజేత ఎవరో చెప్పేసిన ధనరాజ్

dhanraj
జె| Last Modified సోమవారం, 16 నవంబరు 2020 (16:54 IST)
బిగ్ బాస్ షోలో పరిస్థితి ఏంటో అభిమానుల కన్నా కంటెన్టెంట్లే ఠక్కున చెప్పేస్తారు. అందుకు కారణం వారు ఆడుతుంటారు కాబట్టి. మొదటి సీజన్లో ఆడిన ధనరాజ్ ఇప్పుడు నాలుగో సీజన్లో ఎవరు గెలుస్తారో చెప్పడంపై పెద్ద చర్చే జరుగుతోంది.

అభిజిత్ నాకు స్నేహితుడు. మంచి స్నేహితుడు. కొన్ని యుట్యూబ్ వాటిలో మేమిద్దరం కలిసి పనిచేశాం కదా. కానీ అవినాష్ ఈ మధ్య తనలోని కొత్త కోణాన్ని బయట పెడుతున్నాడు. ఎక్కువగా కోపం చూపిస్తున్నాడు. అస్సలు కోపాన్ని ఆపుకోలేకపోతున్నాడు. ఇదంతా అతనికి బాగా మైనస్ అవుతున్నట్లు అనిపిస్తోంది.

కానీ అభిజిత్ మాత్రం ఒకే రకంగా ఉన్నాడు. హౌస్ లోకి వెళ్ళినప్పటి నుంచి ఇప్పటి వరకు అతని తీరు అదే విధంగా ఉంది. ఒకేరకమైన వ్యక్తిత్వంతో ఉన్నాడు కాబట్టి అతనే గెలుస్తాడనుకుంటున్నా. చూద్దాం ఇంకా సమయం ఉంది కదా ఇది నా అభిప్రాయమంటూ ధనరాజ్ చెప్పుకొచ్చాడు.దీనిపై మరింత చదవండి :