సోమవారం, 23 డిశెంబరు 2024
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By సెల్వి
Last Updated : శనివారం, 7 డిశెంబరు 2019 (18:34 IST)

రౌడీ బేబీ పాట కొత్త రికార్డు.. యూట్యూబ్ స్వయంగా ప్రకటించిందోచ్.. (video)

కోలీవుడ్ సూపర్ హిట్ ఫిలిమ్ మారి-2లోని రౌడీ బేబీ పాట కొత్త రికార్డును నమోదు చేసుకుంది. బాలాజీ మోహన్‌ దర్శకత్వం వహించిన మారి-2లో టోవినో, వరలక్ష్మీ శరత్‌ కుమార్‌, కృష్ణలు కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. ఇక మారి మొదటి పార్ట్‌ బాక్సాఫీస్‌ వద్ద అంతగా రాణించకపోయినా సీక్వెల్‌ మాత్రం తమిళంలో భారీగానే కలెక్షన్లు రాబట్టింది. 
 
ఇక రౌడీ బేబీ పాట యూట్యూబ్ వ్యూస్‌లో రికార్డుల మోత మోగిస్తోంది. ఇప్పటివరకూ 725 మిలియన్ వ్యూస్ సాధించి యూట్యూబ్ రికార్డుల్లో ఏడో స్థానాన్ని కైవసం చేసుకుంది.

ధనుష్ స్వయంగా రాసి, పాడిన ఈ పాటకు స్వరకర్త యువన్ శంకర్ రాజా కాగా, అదిరిపోయే స్టెప్పులను అందించారు ప్రముఖ కొరియో గ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవా. రౌడీ బేబీ’ వీడియో సాంగ్ టాప్-7లో నిలిచి రికార్డులను సృష్టించిన విషయాన్ని యూట్యూబ్ స్వయంగా ప్రకటించడం విశేషం.