గురువారం, 23 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 13 ఆగస్టు 2019 (17:55 IST)

రౌడీ బేబీ ఖాతాలో కొత్త రికార్డు.. 600 మిలియన్ల వ్యూస్ కైవసం

కోలీవుడ్ సినిమా మారి-2లోని రౌడీ బేబీ పాట మరో రికార్డును సొంతం చేసుకుంది. ధనుష్, ఫిదా భామ సాయిపల్లవి కాంబోలో వచ్చిన ఈ సినిమాలోని రౌడీ బేబీ సాంగ్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. ఈ సినిమాకు విడుదలకు ముందు ఈ వీడియో పాటను సినీ యూనిట్‌ యూట్యూబ్‌లో విడుదల చేసింది. అప్పటి నుంచి యూట్యూబ్‌లో రికార్డులు సృష్టిస్తోంది.
 
బాలాజీ మోహన్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రానికి యువన్‌ శంకర్‌ రాజా సంగీతం అందించారు. రౌడీ బేబీ సాంగ్‌కు ప్రముఖ డ్యాన్స్‌ మాస్టర్‌ ప్రభుదేవా కొరియోగ్రఫీ చేశారు. మరోవైపు సోషల్‌ మీడియాలో సాయిపల్లవి వీడియో సాంగ్‌లు హల్‌చల్‌ చేస్తుంటాయనే సంగతి తెలిసిందే. 
 
ఫిదా చిత్రంలోని వచ్చిండే సాంగ్‌ను కూడా యూట్యూబ్‌లో కోట్లాది మంది ప్రేక్షకులు వీక్షించారు. అయితే ఆ వ్యూస్‌ను రౌడీ బేబీ సాంగ్‌ కేవలం 40 రోజుల వ్యవధిలోనే అధిగమించిడం విశేషం. తాజాగా ఈ సాంగ్‌ యూట్యూబ్‌లో 600 మిలియన్‌(60 కోట్ల) వ్యూస్‌ను దాటింది.