శనివారం, 11 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By ఠాగూర్
Last Updated : శనివారం, 20 ఆగస్టు 2022 (14:57 IST)

హీరో ధనుష్ అభిమానుల అతి చర్య.. థియేటర్ స్క్రీన్ చింపివేత

theater screen damage
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్‌ అభిమానులు దుశ్చర్యకు పాల్పడ్డారు. తమ అభిమాన హీరో నటించిన చిత్రం ప్రదర్శిస్తున్న థియేటర్ స్క్రీన్‌ను చింపివేశారు. ఈ ఘటన చెన్నై కోయంబేడులోని ఓ ప్రముఖ సినీ కాంప్లెక్స్ థియేటర్‌లో జరిగింది. 
 
తాజాగా వెలుగులోకి వచ్చిన ఈ వివరాలను పరిశీలిస్తే, ఈ నెల 18వ తేదీన ధనుష్ నటించిన "తిరుచిట్రాంబలం"(తెలుగులో "తిరు") చిత్రం విడుదలైంది. చాలాకాలం తర్వాత ధనుష్ నటించిన చిత్రం థియేటర్‌లో విడుదలైంది. దీంతో ఈ చిత్రం తొలి ఆటను చూసేందుకు వచ్చిన ఫ్యాన్స్ థియేటర్ స్క్రీన్‌ను చింపివేశారు. 
 
పైగా, ఈ సినిమాకు మంచి టాక్ రావడంతో ఆ ఆనందంతో ఈ పాడుపనికి పాల్పడ్డారు. కాగా, ఈ చిత్రంలో ధనుష్ సరసన నిత్యామీనన్, రాశీఖన్నా, ప్రియా భవానీ శంకర్‌లు హీరోయిన్లుగా నటించగా, భారతీరాజా, ప్రకాష్ రాజ్‌లు కీలక పాత్రలను పోషించారు. మిత్రన్ ఆర్. జవహర్ దర్శకత్వం వహించగా, అనిరుధ్ రవిచంద్రన్ సంగీతం సమకూర్చారు. సన్ పిక్చర్స్ బ్యానరులో నిర్మాత కళానిధి మారన్ నిర్మించారు.