గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : శుక్రవారం, 16 జూన్ 2023 (19:01 IST)

రిలీజ్‌కి సిద్ధ‌మ‌వుతోన్న ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ LGM

Dhoni
Dhoni
ఇండియ‌న్ క్రికెట్ హిస్ట్రరీలో స‌క్సెస్‌ఫుల్ కెప్టెన్ మ‌హేంద్ర సింగ్ ధోని చిత్ర నిర్మాణ రంగంలోకి అడుగు పెట్టారు. ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై LGM సినిమాను రూపొందిస్తున్నారు. త‌మిళంలో రూపొందుతోన్న ఈ చిత్రాన్ని తెలుగులోనూ విడుద‌ల చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కుతోన్న ఈ చిత్రాన్ని ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ద‌ర్శ‌క‌త్వంలో ధోని ఎంట‌ర్‌టైన్‌మెంట్ బ్యాన‌ర్‌పై సాక్షి ధోని నిర్మిస్తున్నారు.
 
Dhoni cast
Dhoni cast
సినిమా చిత్రీక‌ర‌ణ‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ..పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాల‌ను పూర్తి చేసుకుంటోంది. త్వ‌ర‌లోనే ట్రైల‌ర్‌ను, ఆడియో విడుద‌ల చేయ‌టానికి సన్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్‌. ఈ కార్య‌క్ర‌మంలో మ‌హేంద్ర సింగ్ ధోని, సాక్షి ధోని పాల్గొన‌నున్నారు.
 
ఈ సంద‌ర్భంగా చిత్ర ద‌ర్శ‌కుడు ర‌మేష్ త‌మిళ్ మ‌ణి మాట్లాడుతూ ‘‘కుటుంబం అంతా కలిసి చూసే కామెడీ ఫ్యామిలీ డ్రామాగా LGM సినిమాను రూపొందిస్తున్నాం. సినిమా నవ్విస్తూనే ప్రేక్ష‌కుల గుండెల‌ను తాకుతుంది. LGM చిత్రానికి ప్రేక్ష‌కులు త‌మ ప్రేమ‌, ఆద‌ర‌ణ‌ను అందిస్తార‌ని భావిస్తున్నాం’’ అన్నారు.
 
ఇటీవ‌ల విడుదలైన LGM టీజర్ కు అద్భుత‌మైన స్పంద‌న వ‌చ్చింది. డిజిట‌ల్ ఫ్లాట్‌ఫామ్‌లో 7 మిలియ‌న్స్‌కు పైగా వ్యూస్‌ను ఇది సాధించింది.
 
ఫ్యామిలీ ఎంట‌ర్‌టైన‌ర్‌గా రూపొందుతోన్న LGM చిత్రానికి ర‌మేష్ త‌మిళ్ మ‌ణి ద‌ర్శ‌క‌త్వం వ‌హించ‌టంతో పాటు మ్యూజిక్‌ను కూడా అందించారు. యోగి బాబు, మిర్చి విజ‌య్ త‌దిత‌రులు ప్ర‌ధాన పాత్ర‌ల్లో న‌టించారు.