గురువారం, 9 జనవరి 2025
  1. వినోదం
  2. తెలుగు సినిమా
  3. కథనాలు
Written By డీవీ
Last Updated : బుధవారం, 28 జూన్ 2023 (17:40 IST)

హత్య చేసిన వారిని డిటెక్టివ్ విజయ్ ఆంటోనీ పట్టుకున్నాడా?

Vijay Antony,  Ritika Singh
Vijay Antony, Ritika Singh
బిచ్చగాడు 2 సినిమా తో బ్లాక్బస్టర్ హిట్ కొట్టిన విజయ్ ఆంటోనీ, మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిదంగా ఉన్నారు.  విజయ్ ఆంటోనీ నటిస్తున్న కొత్త సినిమా 'హత్య', ఒక ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీగా ఈ సినిమా రూపొందుతోంది. ఈ చిత్రంలో డిటెక్టివ్ పాత్రలో విజయ్ ఆంటోనీ కనిపించనున్నారు. హీరోయిన్ రితికా సింగ్ ఓ కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమా ట్రైలర్ ఇప్పటికే ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఈ రోజు దర్శకనిర్మాతలు సినిమా విడుదల తేదీ ని ప్రకటించారు. జులై 21 న ఈ సినిమా థియేటర్స్ లో ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. కంప్లీట్ మేక్ ఓవర్ తో, కొత్త లుక్ తో, చూడటానికి చాలా కొత్తగా ఉన్నారు విజయ్ ఆంటోనీ. ఎప్పుడూ కూడా కొత్త కథలతో, భిన్నమైన కాన్సెప్ట్ లతో ప్రేక్షకులను అలరించడానికి సిద్ధంగా ఉన్నారు విజయ్. 
 
లోటస్ పిక్చర్స్ తో కలిసి ఇన్ఫినిటీ ఫిలిం వెంచర్స్ సంస్థ నిర్మిస్తోంది. ఈ చిత్రానికి కమల్ బోరా, జి.ధనుంజయన్, ప్రదీప్ బి, పంకజ్ బోరా, విక్రమ్ కుమార్, తాన్ శ్రీ దొరైసింగమ్ పిల్లై, సిద్ధార్థ్ శంకర్, ఆర్వీఎస్ అశోక్ కుమార్ నిర్మాతలు కాగా బాలాజీ కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు.
 
ఈ చిత్రంలో ఇతర కీలక పాత్రల్లో మురళీ శర్మ, జాన్ విజయ్, రాదికా శరత్‌కుమార్, సిద్ధార్థ శంకర్, అర్జున్ చిదంబరం, కిషోర్ కుమార్, సంకిత్ బోరా తదితరులు నటిస్తున్నారు. శివకుమార్ విజయన్ సినిమాటోగ్రఫీ అందిస్తుండగా..ఆర్‌కె సెల్వ ఎడిటింగ్ బాధ్యతలు నిర్వహిస్తున్నారు. గిరీష్ గోపాలకృష్ణన్ సంగీతం సమకూరుస్తున్నారు.